Allu Arjun: ఫస్ట్ టైం అలాంటి పాత్రలో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పూనకాలే

Allu Arjun: ఫస్ట్ టైం అలాంటి పాత్రలో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పూనకాలే


Allu Arjun: ఫస్ట్ టైం అలాంటి పాత్రలో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పూనకాలే

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. ఇటీవలే పుష్ప సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్, పుష్ప 1 అలాగే పుష్ప 2 రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు స్టార్ హీరో అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బన్నీ. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గురించి మొన్నామధ్య ఓ అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ముఖ్యంగా సూపర్ హీరోల కాన్సెప్ట్ తో మూవీ ఉంటుందని ఓ వీడియో ద్వారా చెప్పకనే చెప్పారు మేకర్స్.  దాంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇది కూడా చదవండి :కోటీశ్వరుల సంబంధాలకు నో చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్‌ను పెళ్లాడింది.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఈ సినిమా ప్రీప్రొడక్షన్ కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామాగా, భారీ బడ్జెట్‌తో, అత్యధిక విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సన్నివేశాలతో తెరకెక్కనుందని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమాలో  అల్లు అర్జున్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయనున్నాడని, ఒక పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ లో నటించలేదు .. ఫస్ట్ టైం అట్లీ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మాస్ మావ..! ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. స్టార్స్ లేకుండానే బ్లాక్ బస్టర్

అలాగే ఈ సినిమా కోసం హాలీవుడ్ మేకర్స్ ను రంగంలోకి దింపనున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ , అట్లీ ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉన్నారని సమాచారం. ఈ సినిమా ఒక విభిన్నమైన ప్రపంచాన్ని చూపించేలా రూపొందనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. దీపికా తో పాటు మరికొంతమంది హీరోయిన్స్ కూడా నటించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పనిచేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు తెరకెక్కని స్టైల్ లో ఈ సినిమాను అట్లీ తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి : ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పని చేశాడు.. ఇప్పుడు పాన్ ఇండియాను ఏలుతున్నాడు.. అతను ఎవరంటే

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *