లైట్ తీసుకునేరు.. బ్రహ్మాస్త్రం.. వీటిని పాలలో నానబెట్టి తింటే ఆ సమస్యలన్నీ ఖతమే..

లైట్ తీసుకునేరు.. బ్రహ్మాస్త్రం.. వీటిని పాలలో నానబెట్టి తింటే ఆ సమస్యలన్నీ ఖతమే..


అంజీర్.. వీటిని అత్తిపండు అని కూడా పిలుస్తారు.. అంజీర్ పండ్లలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే వీటిని పోషకాల గని అంటారు.. వీటిని రెగ్యులర్‌ గా తింటే.. ఎన్నో సమస్యలను సులభంగా ఎదుర్కొవచ్చు.. అంజీర్ పండ్లలో మెగ్నీషియం, రిబోఫ్లేవిన్, థియామిన్, బి6, విటమిన్ కె, పొటాషియం, రాగి, ఫైబర్ వంటి అనేక పోషకాలు మంచి మొత్తంలో ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి.. అంజీర్ పండ్లను పచ్చిగా.. అలాగే ఎండినవి తినవచ్చు.. రెండింటిలోనూ పోషకాలు ఎక్కువగానే ఉంటాయి..

అంజీర్ పండ్లను డ్రై ఫ్రూట్ లాగా ప్రతి సీజన్‌లో సులభంగా తినవచ్చు. వేసవిలో నానబెట్టి తినాలి.. ఎందుకంటే దీని స్వభావం వేడిగా ఉంటుంది. వేసవిలోప్రజలు రాత్రిపూట నీటిలో నానబెట్టి అంజీర్ పండ్లు తింటారు. పాలలో కూడా నానబెట్టి తినవచ్చని దీంతో ప్రయోజనాలు మరింత పెరుగుతాయని డైటీషియన్లు చెబుతున్నారు. అంజీర్ పండ్లను పాలతో కలిపి తింటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం..

పాలలో నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు..

అంజీర్ పండ్లు మీ జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.. మీరు వాటిని పాలతో తీసుకుంటే, మీరు మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే బరువు కూడా తగ్గవచ్చు..

పాలలో నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల మంచి మొత్తంలో పోషకాలు లభిస్తాయి, ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.. నిద్రను మెరుగుపరుస్తుంది.

పాలలో నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల కండరాలు, ఎముకలు రెండూ బలపడతాయి. ఇది శరీరంలో శక్తిని నిలుపుకుంటుంది.. మీరు రోజంతా ఫిట్‌గా ఉంటారు.

వాత-పిత్త అసమతుల్యతతో బాధపడేవారు కూడా అంజీర్‌ ను తీసుకోవచ్చు.. పాలు లేకపోతే.. నీటినిలో నానబెట్టి తీసుకోవచ్చు..

అంజీర్ పండ్ల వినియోగం రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా శరీరాన్ని చల్లబరుస్తుంది. రక్తం నుండి పాత, దెబ్బతిన్న కణాలను తొలగించి ఆరోగ్యాన్ని మెరుపరుస్తుంది.

అంజీర్ లో శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. ఇది వాపు తగ్గించడంతోపాటు.. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

ఎలా తీసుకోవాలి..

రెండు నుండి మూడు పొడి అంజీర్ ముక్కలను ఉడికించిన పాలలో నానబెట్టి, ఉదయం నిద్రలేచిన తర్వాత, మీరు ఈ పాలను కొద్దిగా వేడి చేసి త్రాగవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *