Numerology: ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు అతిగా ఆలోచిస్తారు.. ఏ నిర్ణయాలు త్వరగా తీసుకోలేరు..

Numerology: ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు అతిగా ఆలోచిస్తారు.. ఏ నిర్ణయాలు త్వరగా తీసుకోలేరు..


వ్యక్తికీ వ్యక్తీ మధ్య ఆలోచన తీరు, నడవడిక, లక్షణాలు అన్నీ భిన్నంగా ఉంటాయి. మనిషి పుట్టిన తేదీని బట్టి.. వారి మూలా సంఖ్య తెలుసుకోవచ్చు. ఆ మూల సంఖ్యకు ఒకొక్క గ్రహం అధినేతగా ఉంటారు. పుట్టిన తేదీ నుంచి ప్రతి ఒక్కరూ తమ మూల సంఖ్యను కనుగొనవచ్చు. ఒక వ్యక్తి పుట్టిన తేదీ సంఖ్యలను జోడించడం ద్వారా మూల సంఖ్యను కనుగొనవచ్చు. ఉదాహరణకు ఎవరైనా ఒక నెలలో 20వ తేదీన జన్మించినట్లయితే, వారి మూల సంఖ్య 2+0=2 అవుతుంది.

ఈ మూల సంఖ్య వారు అతిగా ఆలోచిస్తారు
2వ తేదీన జన్మించిన వారు ఏ నెలలోనైనా 2వ, 11వ, 20వ లేదా 29వ తేదీలలో జన్మించిన వారు.. మూల సంఖ్య 2. ఈ సంఖ్య చంద్రునికి సంబంధించినది. కనుక ఈ రాడిక్స్ 2 ఉన్నవారు చంద్రుడి కదలికల వలెనే ఉంటుందట. అంటే ఈ సంఖ్య గల వ్యక్తులు భావోద్వేగపరంగా.. చాలా ప్రశాంతంగా ఉంటారు. ఊహాత్మకంగా ఉంటారు. దీనితో పాటు వీరు చిన్నచిన్న విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు.

వీరి ప్రత్యేకత ఏమిటంటే
సంఖ్యాశాస్త్రం ప్రకారం 2వ సంఖ్య రాడిక్స్ ఉన్న వ్యక్తులు సృజనాత్మకతతో ఉంటారు. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు ఎల్లప్పుడూ మనస్సులో కొత్త కొత్త ఆలోచనలను చేస్తూ ఉంటారు. స్థిరంగా ఉండవు వీరి ఆలోచనలు. అంతేకాదు ఆ ఆలోచనాలను తమ జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తారు.

ఇవి కూడా చదవండి

ప్రేమ, అందంలో వీరు ఎన్నదగిన వారు. ఏ పని చేసినా ఎల్లప్పుడూ ముందుంటారు. అలాగే వీరి వ్యక్తిత్వం కారణంగా ఇతరులు వీరి వైపు త్వరగా ఆకర్షితులవుతారు. ఈ లక్షణాల కారణంగా వీరు కొత్తవారిని సైతం త్వరగా స్నేహితులను చేసుకుంటారు.

వీరిలో ఉన్న లోపాలు ఏమిటంటే
2వ సంఖ్య గల వ్యక్తులు ఏ విషయం గురించి అయినా చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. అయితే ఒకే విషయం గురించి ఎక్కువసేపు ఆలోచించరు. అంతేకాదు తీసుకున్న నిర్ణయానికి ఎక్కువసేపు కట్టుబడి ఉండలేరు. భావోద్వేగానికి లోనవుతారు. చిన్న విషయాలను కూడా మనసుకి తీసుకుంటారు. కోపంగా ఉంటారు. అంతేకాదు వీరు ఏ విషయం గురించైనా త్వరగా నిర్ణయాలు తీసుకోలేరు. వీరిలో ఆత్మవిశ్వాసం కూడా ఉండదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *