ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి రానుంది. ఇది కేవలం బస్సుల్లో ఫ్రీ ప్రయాణమే కాదు… జీవన ప్రయాణంలో కొత్త దారులు తెరవబోతున్న సంకల్పం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు ఇది ఉపశమనం. రోజూ ఉద్యోగం కోసం బయలుదేరే వర్కింగ్ వుమెన్‌కి, గ్రామాల నుంచి వస్తున్న ప్రయాణికులకి ఇది ఒక ఊరట. నెలకు వెచ్చించే రవాణా ఖర్చు తగ్గడం ద్వారా కుటుంబ బడ్జెట్‌లో తేడా కనిపించనుంది. ఈ పథకం పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో వర్తిస్తుంది. ప్రత్యేకంగా ఎలాంటి పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సాధారణ గుర్తింపు కార్డు చూపించడం చాలూ. ఎక్కడి నుంచి ఎక్కడికైనా — రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణానికి అనుమతి ఉంది. అన్ని వయసుల మహిళలకూ ఇది వర్తిస్తుంది.
ఇది చదవండి: పైకి చూసి డెలివరీ బాయ్స్ అనుకునేరు.. బంగారం షాప్‌లో ఏం చేశారో తెలిస్తే దిమ్మతిరుగుద్ది
ఏం చూపించాలి? ఎలా ప్రయాణించాలి?
ఈ పథకాన్ని వినియోగించాలంటే రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ఏదైనా ఒక్కటి చూపించాలి. ఆధార్, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు — వీటిలో ఏదైనా చాలని అధికారులు తెలిపారు. ప్రయాణ సమయంలో టికెట్ ఇచ్చే అవకాశం ఉంది కానీ ప్రయాణికుల నుంచి చార్జ్ మాత్రం తీసుకోరు. చిన్నారులు, విద్యార్థినులు, వృద్ధుల వరకు అన్ని వయసుల మహిళలూ ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
ప్రయాణానికి ముందు తెలుసుకోవాల్సింది
ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాలు, జిల్లాల మధ్య నడిచే సాధారణ బస్సులకు వర్తిస్తుంది. అయితే, గరుడ, అమరావతి, ఏసీ, లగ్జరీ తరహా ప్రీమియం సర్వీసులకు మాత్రం ఈ స్కీమ్ వర్తించదు. సాధారణ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌కి మాత్రమే ఇది పరిమితం. ఎవరైనా మహిళా ప్రయాణికురాలు ప్రయాణానికి ముందుగా ఆ బస్సు రూటు ఈ పథకానికి వర్తిస్తుందా అనే విషయాన్ని ఆర్టీసీ వెబ్‌సైట్ లేదా బస్టాండ్ కౌంటర్ వద్ద నిర్ధారించుకుని ప్రయాణించడం మంచిది.
ఇది చదవండి: ఫ్రెండ్‌తో ‘వన్ నైట్ స్టాండ్’.. ప్రెగ్నెన్సీ, ఆపై గుట్టుగా అబార్షన్.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరంటే.?
ఏం ఉండాలి? ఏం ఉండదు? – క్లారిటీ కోసం ఇదీ గైడ్
రాష్ట్రంలోని అన్ని వయస్సుల మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది
పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించొచ్చు
గరుడ, ఏసీ, లగ్జరీ తరహా ప్రీమియం బస్సుల్లో ఈ పథకం వర్తించదు
ఆధార్, ఓటరు, లైసెన్స్, పాన్ వంటి గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక్కటి చూపితే సరిపోతుంది
టికెట్ ఇవ్వడం జరుగుతుంది కానీ చార్జ్ వసూలు చేయరు
రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు
బస్సు రూట్ ఈ పథకానికి వర్తిస్తుందో లేదో ముందుగా ఆర్టీసీ అధికారిక సమాచారంతో నిర్ధారించుకోవాలి
ఇది చదవండి: కంత్రీ కోరికలు.. కరువెక్కిపోయి కడుపునొప్పితో ఆస్పత్రికి.. ఆపై టెస్టులు చేయగా
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి