Viral News: కొత్త జంటలకు బ్యాడ్ న్యూస్.. ఇకపై పెళ్లికి ముందు నో ఫోన్ కాల్స్!

Viral News: కొత్త జంటలకు బ్యాడ్ న్యూస్.. ఇకపై పెళ్లికి ముందు నో ఫోన్ కాల్స్!


ఒకప్పుడు పెళ్లి అంటే చేసుకోబోయే అమ్మాయిని ఎంగేజ్‌మెంట్ టైంలో చూస్తే ఇక డైరెక్ట్‌గా పెళ్లి పీటల మీద చూడడమే.. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు మాత్రమే వదువరులను చూసి డైరెక్ట్‌గా పెళ్లి చేసేవారు. కానీ ఇప్పుడు అదంతా మారిపోయింది. పెళ్లి ఫిక్స్ అయిందంటే చాలు ఫోన్‌లో ముచ్చట్లు పెట్టి అన్ని మాట్లాడేసుకుంటున్నారు. పైగా సినిమాలు, షికారులు అని చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇద్దరి మధ్య మాటలు కుదరక పెళ్లి వరకు రాకుండానే వారు విడిపోతున్నారు.

తాజాగా ఇలాగే జరిగిన ఓ సంఘటన తర్వాత ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్‌ జిల్లాలో సేన్‌ సమాజం కీలక నిర్ణయం తీసుకుంది. తమ సామాజికవర్గానికి చెందిన వారిలో ఎవరైనా పెళ్లి చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంటే ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత వధూవరులిద్దరూ పెళ్లయ్యేదాకా ఫోన్లలో మాట్లాడుకోవడం కాని, కలవడంపై నిషేధం విధించింది. ఇలా పెళ్లికి ముందే ఫోన్‌లు మాట్లాడుకోవడం ద్వారా కుటుంబ సంబంధాలు విచ్చిన్నం అవుతున్నాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సేన్ సమాజ్ సభ్యులు తెలిపారు.

అయితే ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకోబోయే యువతీ, యువకులు ఇద్దరూ కుటుంబసభ్యుల సమక్షంలో మాట్లాడుకోవచ్చని.. దీనికి ఎలాంటి అభ్యంతరం లేదని సేన్‌ కమ్యూనిటీ బాలోద్‌ జిల్లా అధ్యక్షుడు సంతోష్‌ కౌశిక్‌ తెలిపారు. చత్తీస్‌గడ్‌ జిల్లాలో సేన్ సమాజ్ కమ్మూనిటీ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది. ఇది తెలిసిన చాలా మంది పెళ్లికి ముందు మాట్లాడకపోతే.. ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *