అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావట్లేదా? ఇలా చేయండి..

అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావట్లేదా? ఇలా చేయండి..


అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావట్లేదా? ఇలా చేయండి..

ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త నండూరి శ్రీనివాస్ తమ ఛానెల్ ద్వారా ఆర్థిక సమస్యలు, రుణ బాధలకు సంబంధించిన పలు మార్గాలను సూచిస్తున్నారు. దేవతానుగ్రహంతో చాలామంది జీవితాలు బాగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు. అయితే, చాలామంది అడుగుతున్న సాధారణ ప్రశ్న ఏమిటంటే, జాలిపడి కష్టాల్లో ఉన్నారని ఇతరులకు అప్పిచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదని.. అవసరంలో ఉన్నారని భావించి సహాయం చేసినప్పటికీ, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత కూడా డబ్బులు తిరిగి ఇవ్వకుండా, కనీసం తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో వారాహి అమ్మవారి ఆరాధనను శ్రద్ధగా చేయాలని నందూరి శ్రీనివాస్ సూచించారు. వారాహి అమ్మవారు తీవ్ర దేవత కాబట్టి, అలాంటి వ్యక్తులను దారిలోకి తీసుకొచ్చి, అప్పిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేలా చేస్తారని ఆయన వివరించారు. కోట్లు అప్పిచ్చి, ఇకపై తిరిగి రావు అనుకున్న వారికి కూడా వారాహి అమ్మవారి ఆరాధన ద్వారా డబ్బులు వెనక్కి వచ్చాయని ఆయన అనేక ఉదాహరణలు చెప్పడం జరిగింది. కాబట్టి, భక్తితో వారాహి అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని నందూరి తెలియజేశారు.

Also Read: శివశంకర్ మాస్టర్ చనిపోతే పాడె మోసేవారు కూడా లేరు.. ఆ ఇద్దరు సెలబ్రిటీలు మాత్రం..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *