రక్త సంబంధాలు వద్దు.. ఆస్తులు, డబ్బులే ముద్దు.. మనుషుల ప్రాణాల కన్న డబ్బులు, ఆస్తులే ముఖ్యం అన్నట్లుగా కొంతమంది వ్యవహరిస్తున్నారు.. డబ్బు మీద ప్రేమతో.. సొంత వాళ్ళనే కడతెరస్తూ కిరాతకాలకు పాల్పడుతుండటం కలకలం రేపుతోంది.. అచ్చం ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. భూ తగదాలతో సొంత అన్ననే హత్య చేసింది చెల్లె.. వివాదంలో ఉన్న భూమిని అమ్మాడని కక్ష పెంచుకుని పక్కా ప్లాన్ ప్రకారం మర్డర్ చేసింది. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. దుబ్బాక చెల్లాపూర్ గ్రామానికి చెందిన వంగ బాల్ రెడ్డి. గత బీఆర్ఎస్ హయంలో రైతు సమన్వయ సమితి చైర్మన్ గా పనిచేశాడు. గత కొన్నెళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు బాల్ రెడ్డి. బాల్ రెడ్డికి రాజక్కపేట గ్రామ శివారులో కొంత వ్యవసాయ భూమి ఉంది. అయితే తనకు వరుసకు చెల్లి అయ్యే రేణుకకి తన కుటుంబ సభ్యులతో భూమి విషయంలో కొన్నెళ్లుగా గొడవలు జరుగుతున్నాయి..
అందులో ఓ 11 ఎకరాల భూమిని బాల్ రెడ్డి తన సొంత చెల్లెలికి కొనిచ్చారు. విషయం తెలుసుకున్న రేణుక భూమి గురించి గొడవలు జరుగుతున్నా.. ఆ భూమిని ఎలా కొంటారని బాల్ రెడ్డితో వివాదం మొదలైంది. కొన్నెళ్ల క్రితమే ఆ భూమిని తీసుకున్నా పోజిషన్ లోని రానివ్వట్లేదు రేణుక. దీంతో ఇటు బాల్ రెడ్డికి వరుసకి చెల్లెలు అయ్యే రేణుక మధ్య వివాదం పెద్దది అయ్యింది. ఎన్ని రోజులైన భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో బాల్ రెడ్డి పై చెల్లె రేణుక కక్ష పెంచుకుంది. ఈ భూ తగదాలకు మొత్తం కారణం తన అన్న బాల్ రెడ్డే అని. అతన్ని (అన్నని) చంపేస్తే వారు కొనుగోలు చేసినా 11 ఎకరాల భూమిని తిరిగి సొంతం చేసుకోవచ్చని ప్లాన్ వేసింది రేణుక..
దీంతో ఫిబ్రవరి 20న తన అన్న బాల్ రెడ్డికి ఫోన్ చేసి భూమి విషయంలో మాట్లాడుదామాని పిలిచింది రేణుక.. దీంతో బాల్ రెడ్డి చెల్లాపూర్ నుంచి రాజక్కపేటకు బయలుదేరారు.. వెళ్లే ముందు ఈ విషయాన్ని తన చెల్లెకి చెప్పి వెళ్లాడు బాల్ రెడ్డి. కాసేపటికి బాల్ రెడ్డికి ఫోన్ చేయడంతో గొడవ జరుగుతున్న శబ్దం వినిపించింది. దీంతో ఆమె హుటాహుటిన ఇంటి నుంచి బయలుదేరింది. పోలం వద్దకు వెళ్లే సరికి రక్తపుమడుగులో పడి ఉన్నాడు బాల్ రెడ్డి.. మారణాయుధాలతో పీక కోసి అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు..
అయితే బాల్ రెడ్డి పోలం వద్దకు వెళ్లాక మరోసారి రేణుక బాల్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అప్పటికే బాల్ రెడ్డిని చంపాలని ప్లాన్ ఉండటంతో రేణుక తన కుమారుడితో పాటు మరికొందరు కలిసి బాల్ రెడ్డిని హత్య చేసినట్టు సమాచారం. హత్య చేసిన అనంతరం రేణుక నేరుగా దుబ్బాక పోలీస్ స్టేషన్ లో పోలీసులకు లొంగిపోగా మృతుడు బాల్ రెడ్డి మేనల్లుడు సోను రెడ్డి మాత్రం పరారయ్యాడు..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం సహాయంతో పలు ఆధారాలను సేకరించిన అనంతరం బాల్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాల్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. మొత్తంగా భూ వివాదంలో అన్నను చెల్లె చంపిన ఘటన జిల్లాలో సంచలనం రేపింది. ఈ ఘటనతో రాజక్కపేట, చెల్లాపూర్ గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఏదైనా భూ సమస్యలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి కానీ ఇలా చంపుకోవడం మంచింది కాదు అని.. గ్రామస్థులు పేర్కొంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..