LPG Gas Cylinder: సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్ ఉండే ఉంటుంది. ఈ రోజుల్లో కట్టెల పొయ్యిపై వంట చేసుకునే వారి సంఖ్య తగ్గిపోయింది. ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ సిలిండర్‌పైనే వంట చేసుకుంటున్నారు. అయితే సిలిండర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలాగే కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా సిలిండర్లకు ఉండే గడువు తేదీ ఉంటుందని మీకు తెలుసా? గ్యాస్ పైపు విషయంలో కొన్ని సూచనలు పాటించాలని చెబుతున్నారు. ఇంతకీ, గ్యాస్ సిలిండర్ గడువు తేదీ ఎలా గుర్తించాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
సిలిండర్ ఎక్స్పైరీ తేదీని గుర్తించడం ఎలా?
సాధారణంగా గ్యాస్ వాడేటప్పుడు చాలా మంది సిలిండర్ తీసుకునేటప్పుడు గ్యాస్ లీక్ అవుతుందో లేదో చెక్ చేస్తారు. లేదంటే దాని బరువునూ తనిఖీ చేస్తారు. కానీ, గడువు తేదీని మాత్రం ఎప్పుడూ కూడా చెక్ చేయరు. ఇకపై సిలిండర్ తీసుకునేటప్పుడు గడుపు తేదీ కూడా చెక్ చేసి తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. సిలిండర్‌పై అంటే హ్యాండిల్ కింది భాగంలో A, B, C, D అనేవి ఉంటాయి. అనే వాటిల్లో ఏదో ఒక అక్షరం ఉండి పక్కన సంఖ్య కలిగి ఉంటుంది. సిలిండర్ మీద ఉండే ABCDల అర్థం తెలుసుకుందాం..
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి: PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ 22వ విడత వచ్చేది అప్పుడేనా..?
అక్షరం (A, B, C, D): ఇది సంవత్సరాన్ని నాలుగు త్రైమాసికాలుగా విభజిస్తుంది.
A – జనవరి నుంచి మార్చి వరకు.
B – ఏప్రిల్ నుంచి జూన్ వరకు.
C – జులై నుంచి సెప్టెంబర్ వరకు.
D – అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు.
ఉదాహరణకు 25 అని ఉంటే: ఇది గడువు ముగిసే సంవత్సరాన్ని సూచిస్తుంది. 25 అంటే 2025. ఈ సంవత్సరం ముగిసిన సిలిండర్ వాడుతున్నట్లయితే వెంటనే గ్యాస్ ఏజన్సీకి సమాచారం అందించండి. లేదా మీరు గ్యాస్ తీసుకునే ముందు ఓ సారి చెక్ చేసుకోండి. ఇలాంటి సంవత్సరం నంబర్ ఉన్నట్లయితే తీసుకోకుండా రిటన్ ఇచ్చేయండి. లేకుంటే అలాగే మీకు తెలియకుండా వాడుతున్నట్లయితే అది పేలిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉదాహరణకు మీరు తీసుకున్న సిలిండర్ మీద “A-27” అని రాసి ఉంటే దాని గడువు తేదీ 2027వ సంవత్సరం జనవరి నుంచి మార్చి మధ్యలో ముగుస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు వీటిని గమనించడం చాలా ముఖ్యం. లేకుంటే ప్రమాదంలో పడవచ్చంటున్నారు నిపుణులు.
గ్యాస్ పైపు..
గ్యాస్ సిలిండర్స్ పేలకుండా ఉండడంలో మనం వాడే పైపులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కొంత మంది మార్కెట్లో తక్కువ ధరల్లో వచ్చే గ్యాస్ పైపులను వాడుతుంటారు. అలాంటివి ఎప్పుడు కూడా కొనుగోలు చేయవద్దంటున్నారు నిపుణులు. తక్కువ రేటులో వచ్చే పైపులు నాణ్యత ఉండవని, క్వాలిటీ లేని పైప్స్, రెగ్యులేటర్లనును కొని వాడుతుంటారు. అలాంటి వాటి వల్ల ప్రమాదం పొంచి ఉందంటున్నారు. నాణ్యత లేవిని పైపు, రెగ్యులేటర్ల వల్ల గ్యాస్ లీకయ్యే ప్రమాదం ఉంది. ఎప్పుడు కూడా BIS హాల్‌మార్క్ ఉన్న రెగ్యులేటర్స్, పైపులను మాత్రమే వాడడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి