Jr NTR: వదంతి కాదు.. ఈసారి పక్కా అంటున్న జూనియర్ ఎన్టీఆర్

Jr NTR: వదంతి కాదు.. ఈసారి పక్కా అంటున్న జూనియర్ ఎన్టీఆర్


దేవర 2 సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు అసవరం లేదు.. ఎందుకంటే తెరవెనక జరగాల్సిన పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దేవర 2 మీద మరో సెన్సేషనల్ అప్‌డేట్ వచ్చింది.. అది తెలిసాక తారక్ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. మరి దేవర 2 ముచ్చట్లేంటి..? రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలు కానుంది..? చూద్దాం పదండి.. అదేంటో గానీ 500 కోట్ల సినిమా ఇచ్చాక కూడా కొరటాలకు కంగారు తప్పట్లేదు. ఆయన నెక్ట్స్ సినిమాపై ఇంకా సస్పెన్స్ ఉంది. ఓ వైపు దేవర 2 ఉన్నా ఎక్కడో తెలియని అనుమానాలు అలాగే ఉండిపోయాయి. ప్రస్తుతం సెట్స్ మీదున్న ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత దేవర 2 వైపు రానున్నారు ఎన్టీఆర్. మరోవైపు కొరటాల ఫోకస్ అంతా ఇప్పుడు దేవర 2పైనే ఉంది. దేవర విజయం సాధించినా.. కేవలం తారక్ స్టామినాతో ఆడింది.. దసరా సీజన్ కలిసొచ్చిందనే విమర్శలు కూడా బాగానే వచ్చాయి. అందుకే పార్ట్ 2 కోసం ఏడాదిన్నరగా కష్టపడుతున్నారు కొరటాల. కానీ దేవర 2 ఉందో లేదో తెలియని ఈ క్రమంలోనే.. ఆయన చూపులు బాలయ్య వైపు వెళ్లాయనే ప్రచారం కూడా జరిగింది. కానీ అవేం లేవిప్పుడు. దేవర 2 సినిమాపై అనుమానాలు అక్కర్లేదు.. ఆ మధ్య నిర్మాత సుధాకర్ మిక్కిలినేని స్వయంగా ఈ సినిమాపై అప్‌డేట్ ఇచ్చారు. మే నుంచి దేవర 2 సినిమా స్టార్ట్ అవుతుందని.. 2027లో సినిమా విడుదలవుతుందని కన్ఫర్మ్ చేసారు. ఎన్టీఆర్ లేని సీన్స్ ముందుగా షూట్ చేసి.. ఆయనొచ్చాక నవంబర్ నుంచి పూర్తి స్థాయి షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు కొరటాల. ఇప్పటికే దేవర 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయింది. మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి. ప్రశాంత్ నీల్‌తో సినిమా అవ్వగానే.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దేవర 2ను కేవలం ఆర్నెళ్లలో ముగించేలా పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేస్తున్నారు తారక్. మొత్తానికి చూడాలిక.. దేవర 2తో కొరటాల అండ్ ఎన్టీఆర్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్‌.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య

చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్‌..

ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్‌ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా

మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే

Varanasi: ఆ ఒక్క ఎపిసోడ్‌కే రూ.300 కోట్లు.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్న జక్కన్న



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *