బస్సుల్లో రద్దీ భరించలేక, త్వరగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని ఆటో ఎక్కితే.. అక్కడ సాక్షాత్తూ మృత్యువుతోనే ప్రయాణం చేయాల్సి వస్తోంది. హైదరాబాద్ పాతబస్తీలో ఒక ఆటో డ్రైవర్ చేసిన నిర్లక్ష్యపు పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా, నగరవాసులను భయాందోళనలకు గురిచేస్తోంది. రద్దీగా ఉండే పాతబస్తీ రోడ్లపై ఒక ఆటో డ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకుని, స్టీరింగ్‌పై కాళ్లు పెట్టి ఆటో నడుపుతూ కనిపించాడు. అతివేగంగా వెళ్తూ, కనీసం చేతులతో స్టీరింగ్ పట్టుకోకుండా కేవలం కాళ్లతోనే బండిని నియంత్రిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తన ప్రాణమే కాకుండా, తనను నమ్మి ఆటో ఎక్కిన ప్రయాణికుల ప్రాణాలను కూడా గాలిలో దీపంలా మార్చేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు, తోటి వాహనదారులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాణాలకు ఏదైనా జరిగితే బాధ్యులెవరంటూ మండిపడ్డారు నగరవాసులు. ఒక్క పాతబస్తీలోనే కాదు, నగరంలోని పలు ప్రాంతాల్లో ఆటో డ్రైవర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయని విమర్శలు వస్తున్నాయి. నిబంధనలను బేఖాతరు చేస్తూ ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, వారి లైసెన్సులను వెంటనే రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్లపై ప్రయాణం క్షేమంగా సాగాలంటే ఇలాంటి ‘స్టంట్’లు చేసే వారికి చట్టం సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాబోయ్.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్..
ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా
మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే
Varanasi: ఆ ఒక్క ఎపిసోడ్‌కే రూ.300 కోట్లు.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్న జక్కన్న