షాకింగ్‌ నిర్ణయాలు తీసుకుంటున్న టెన్త్‌ విద్యార్ధినిలు..

షాకింగ్‌ నిర్ణయాలు తీసుకుంటున్న టెన్త్‌ విద్యార్ధినిలు..


అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకేరోజు జరిగిన రెండు వేర్వేరు ఘటనలు ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. క్షణికావేశంలో పదవ తరగతి విద్యార్థినులు తీసుకున్న నిర్ణయాలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఒక బాలిక చెరువులో పడి ప్రాణాలు కోల్పోగా, మరొకరు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. పి.గన్నవరం మండలం ముంగండకు చెందిన కుడిపూడి కరుణ పదవ తరగతి చదువుతోంది. ఇంట్లో వారు సెల్ ఫోన్ వాడొద్దని మందలించడంతో మనస్తాపం చెందిన బాలిక, ఇంటి సమీపంలోని చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడింది. స్నేహితులతో సరదాగా గడిపి వచ్చిన కొద్దిసేపటికే బాలిక శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు అమలాపురంలో హషిత అనే 14 ఏళ్ల విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. ట్యూషన్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన బాలిక, అక్కడికి వెళ్లకుండా నడుచుకుంటూ వెళ్లిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇంట్లో గొడవ కారణంగానే హషిత ఇల్లు వదిలి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అమలాపురం డిఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చిన్న చిన్న కారణాలకే బాలికలు ప్రాణాల మీదకు తెచ్చుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచడంతో పాటు వారితో స్నేహపూర్వకంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా అన్వేషణ’ ఇన్‌స్టా అకౌంట్‌.. బ్లాక్‌పై అన్వేష్ సెటైర్లు

బాబోయ్‌.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య

చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్‌..

ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్‌ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా

మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *