సిరిసిల్లలో పులి పంజా.. రంగంలోకి హైదరాబాద్ బృందం

సిరిసిల్లలో పులి పంజా.. రంగంలోకి హైదరాబాద్ బృందం


సిరిసిల్లా జిల్లాలోని ఇల్లంతకుంట, తంగలపల్లి మండలాల్లో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా గ్రామ శివారుల్లో తిరుగుతున్న పులి, ఇప్పటికే నాలుగు పశువులపై దాడి చేసి చంపేయడంతో రైతులు పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. రాత్రి వేళల్లో బయటకు రావడానికి గ్రామస్తులు వణికిపోతున్నారు. పులి సంచారంపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులిని పట్టుకుని, అడవిలోకి పంపేందుకు హైదరాబాద్ నుండి ప్రత్యేక బృందాన్ని రప్పించారు. అటవీ ప్రాంత సరిహద్దుల్లో నిఘా పెంచిన అధికారులు, పులి అడుగుజాడలను గుర్తిస్తున్నారు. రైతులు, గ్రామస్తులు ఎవరూ ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప రాత్రి వేళల్లో గ్రామ శివారుల్లో సంచరించవద్దని హెచ్చరించారు. పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, పులిని పట్టుకునే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ శాఖకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఈ ‘పులి’ భయం ఎప్పుడు వీడుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పులి సంచారంపై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ సంపత్ అందిస్తారు..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్‌.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య

చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్‌..

ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్‌ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా

మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే

Varanasi: ఆ ఒక్క ఎపిసోడ్‌కే రూ.300 కోట్లు.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్న జక్కన్న



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *