నా అన్వేషణ’ ఇన్‌స్టా అకౌంట్‌.. బ్లాక్‌పై అన్వేష్ సెటైర్లు

నా అన్వేషణ’ ఇన్‌స్టా అకౌంట్‌.. బ్లాక్‌పై అన్వేష్ సెటైర్లు


హిందూ దేవుళ్లను తిట్టి.. అమ్మాయిల వస్త్రధారణపై అనుచిత కామెంట్స్‌ చేయడంతో ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌ని కోల్పోయాడు అన్వేష్‌. కాంట్రవర్సీ కామెంట్స్‌కి ముందు 1.8 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉంటే.. ఆ తర్వాత 1.3 మిలియన్స్‌కి తగ్గిపోయారు. అయినా అన్వేష్‌ నోటి దురుసు తగ్గలేదు. డోంట్‌ కేర్‌ అన్నట్టుగా చెలరేగిపోతూ వచ్చాడు. బత్తాయిలు, కాషాయ రంగులంటూ వీడియోలు రిలీజ్‌ చేస్తుండటంతో అన్వేష్‌పై హిందూ సంఘాలు పోలీసులకు కంప్లైంట్‌ చేశాయి. పోలీసులు మెటా దృష్టికి తీసుకెళ్లడంతో ‘నా అన్వేషణ’ ఇన్‌స్టా అకౌంట్‌ ను బ్లాక్‌ చేసింది. ఇప్పుడు దీనిపైనా వ్యంగ్యంగా మాట్లాడుతూ కొత్త వీడియో రిలీజ్‌ చేశాడు అన్వేష్‌. దాంతో, అన్వేష్‌ను ఇండియాకు రప్పించి కఠినంగా శిక్షించాలని, అతని యూట్యూబ్‌ చానల్‌ను కూడా బ్యాన్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. యూట్యూబర్ అన్వేష్ తన నా అన్వేషణ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అవ్వడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇన్‌స్టా అకౌంట్ పోయినా తనకు ఎలాంటి నష్టం లేదని, రూపాయి ఆదాయం రాని ప్లాట్‌ఫారమ్ గురించి తాను బాధపడనని తెలిపాడు. యూట్యూబ్ నుంచే తనకు నెలకు రూ.8 లక్షలు వస్తున్నాయన్నాడు. 2026లో మాత్రం బత్తాయిల్ని వదలనని, నిద్ర పట్టనివ్వనని, క్షమించేదే లేదన్నాడు అన్వేష్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాబోయ్‌.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య

చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్‌..

ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్‌ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా

మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే

Varanasi: ఆ ఒక్క ఎపిసోడ్‌కే రూ.300 కోట్లు.. డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తున్న జక్కన్న



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *