Anupama Parameswaran : యంగ్ హీరోతో అనుపమ డేటింగ్.. అర్దరాత్రి 2 గంటలైనా అతడికే..

Anupama Parameswaran : యంగ్ హీరోతో అనుపమ డేటింగ్.. అర్దరాత్రి 2 గంటలైనా అతడికే..


టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమమ్ సినిమాతో మలయాళీ సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఎక్కువగా తెలుగులోనే నటించింది. అందుకే ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫాలోయింగ్ ఎక్కువే. గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ మంచి నటిగా దూసుకుపోతుంది. ఒక్క ఏడాదిలోనే ఐదారు చిత్రాలతో సినీప్రియులను అలరిస్తుంది. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పర్సనల్ విషయాలు నెట్టింట మారుమోగుతుంది. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ యంగ్ హీరోతో ఆమె డేటింగ్ లో ఉందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం నడుస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

ఈ క్రమంలోనే వీరిద్దరికి సంబంధించిన మరికొన్ని ఫోటోస్ లీక్ కావడంతో ఈ డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది. ఆ హీరో మరెవరో కాదండి.. స్టార్ హీరో విక్రమ్ చియాన్ వారసుడు ధ్రువ్ విక్రమ్. వీరిద్దరు కలిసి బైసన్ అనే చిత్రంలో నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని.. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతుందని టాక్. అంతేకాకుండా అప్పట్లో వీరిద్దరి లిప్ లాక్ ఫోటో లీక్ కావడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

ఇటీవల ముంబైలో జరిగిన ఓ అవార్డ్ ప్రధానోత్సవ వేడుకలో పాల్గొన్న అనుపమ, ధ్రువ్ విక్రమ్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇదే వేదికపై అనుపమకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఆ సమయంలో పక్కనే ఉన్న యాంకర్ మరో ప్రశ్న వేశారు. మీరు అర్ధరాత్రి 2 గంటలకు ఎవరికైనా వీడియో కాల్ చేయాలంటే ఎవరికీ చేస్తారని అడగ్గా… ధ్రువ్ కు కాల్ చేస్తానని అన్నారు. దీంతో ఇప్పుడు వీరిద్దరి ప్రేమ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *