Telangana: ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. టమాటాలు అడిగినోళ్లకు అడిగినన్ని ఉచితం.. ఎందుకో తెలుసా..?

Telangana: ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. టమాటాలు అడిగినోళ్లకు అడిగినన్ని ఉచితం.. ఎందుకో తెలుసా..?


టమాటా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అమ్మకానికి మార్కెట్‌కు తరలించిన టమాటా కోనే నాధుడు కరువయ్యాడు. కనీస గిట్టుబాటు ధర లేదు.. చేతికి అందిన పంట కుళ్లిపోతుండటంతో కొందరు రైతులు కడుపుమండి వినూత్న నిరసన తెలిపారు. వినియోదారులకు టమాటాలు ఉచిత సరఫరా చేసి ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలోని వారాంతపు సంతలో ఈ విచిత్ర సంఘటన జరిగింది. ఒక ట్రాలీ లోడ్ టమాటలు రైతులు ఉచితంగా సరఫరా చేశారు. ఆ టమాటాల కోసం జనం ఇగబడి సంచులు, బట్టలతో ఎగబడ్డారు. సాధారణ సమయంలో టమాటా ధరలు సెంచరీ కొట్టిన సందర్భం కూడా ఉంది. కానీ ఇప్పుడు టమాటా ధరలు నేల చూపులు చూస్తున్నాయి. రైతులు కనీసం కిలో 2 రూపాయల ధర పలకని టమాటా ధర చూసి బిత్తర పోతున్నారు. చేతికి అందిన ఆ పంటను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 1200 కిలో ఒక ట్రాలీ లోడ్ టమాటాలు ఉచితంగా పంపిణీ చేశారు

ఈ ఉచిత పంపిణీ సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో జరిగింది. వారాంతపు సంత సందర్భంగా గూడూరు మండలం భూపతిపేట గ్రామానికి చెందిన సారయ్య, మోహన్, సురేందర్ అనే రైతులు టమాట పంటను అమ్మకానికి తీసుకువచ్చారు. అయితే ఆశించిన స్థాయిలో గిరాకీ లేకపోవడంతో పాటు ధరలు అమాంతం పడిపోయాయి. దీంతో తీవ్ర నిరాశ చెందిన రైతులు ఆ టమాటా ఇంటికి తీసుకెళ్లలేక అక్కడే ఉచితంగా పంపిణీ చేశారు. అప్పులు చేసి కష్టపడి పంట వేస్తే ధరలు దారుణంగా పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వీడియో చూడండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *