Donald Trump: సుప్రీంకోర్టు తీర్పు నిరాశపరిచింది.. ప్రపంచ దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్‌ విధిస్తా: ట్రంప్

Donald Trump: సుప్రీంకోర్టు తీర్పు నిరాశపరిచింది.. ప్రపంచ దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్‌ విధిస్తా: ట్రంప్


అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యక్షుడు ట్రంప్‌ ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. టారిఫ్‌లను కొట్టేయడంపై మండిపడ్డారు. సుప్రీంకోర్టు నిర్ణయం దేశానికి అవమానకరం అన్నారు ట్రంప్‌. ఆ జడ్జిలను చూసి సిగ్గుపడుతున్నా అన్నారు. వారి తీర్పు నన్ను తీవ్రంగా నిరాశపరిచిందని, సుప్రీంకోర్టు జడ్జిలు విదేశీ ప్రభావానికి లోనయ్యారని ఆరోపించారు ట్రంప్‌.  టారిఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు ట్రంప్‌ . ప్రపంచ దేశాలపై అదనంగా 10 శాతం టారిఫ్‌ విధిస్తానని ప్రకటించారు. భారత్‌తో కుదిరిన ఒప్పందానికి వచ్చే ముప్పేమీ లేదన్నారు ట్రంప్‌. టారిఫ్‌లను పెంచే అధికారం తనకు ఉందంటూ 122 సెక్షన్‌ను జడ్జిలకు గుర్తు చేస్తున్నారు ట్రంప్‌..

18 శాతం సుంకాలు చెల్లించాల్సిందే..

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. వాణిజ్య ఒప్పందంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. భారత్‌ 18 శాతం సుంకాలు చెల్లించాల్సిందే అని తేల్చిచెప్పేశారు. 10 శాతం గ్లోబల్‌ టారిప్‌ వల్ల అదనపు సుంకం తక్షణమే అమల్లోకి వస్తాయన్నారు. అయితే 10 శాతం అదనపు సుంకం-  150 రోజులు అమల్లో ఉండబోతోంది. ఈ 150 రోజుల్లో సుంకాలపై కొత్త దారులు వెతుకుతానని ట్రంప్‌ అన్నారు. ఈ లెక్కన భారత్‌ ఎగుమతులపై ఐదునెలలపాటు 28 శాతం సుంకం పడుతుంది.

టారిఫ్‌లు చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ట్రంప్‌ స్పందించారు. తమ దగ్గర ప్లాన్‌ బి ఉందని తెలిపారు. చెప్పినట్టుగానే సెక్షన్‌ 122తో పాటు మరికొన్ని సెక్షన్లను సుప్రీంకోర్టు ముందుంచారు. అమెరికా అధ్యక్షుడిగా టారిఫ్‌లు పెంచే అధికారం తనకు ఉందని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు అమెరికాలో సుప్రీంకోర్టు వర్సెస్‌ అధ్యక్షుడిగా పరిస్థితి మారిపోయింది. అసలు నెక్ట్స్‌ ఏం జరుగుతుందో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ ఆధిపత్య పోరులో ట్రంప్‌ మాట నెగ్గుతుందా? లేక సుప్రీంకోర్టు నిర్ణయమే చెల్లుతుందా? అనేది మిలియన్‌ డాలర్‌ ప్రశ్నగా మారిపోయింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *