T20 World Cup: మమ్మల్ని తక్కువగా చూడొద్దు.! భారత్, వెస్టిండీస్‌లకు జింబాబ్వే గట్టి వార్నింగ్

T20 World Cup: మమ్మల్ని తక్కువగా చూడొద్దు.! భారత్, వెస్టిండీస్‌లకు జింబాబ్వే గట్టి వార్నింగ్


T20 World Cup: మమ్మల్ని తక్కువగా చూడొద్దు.! భారత్, వెస్టిండీస్‌లకు జింబాబ్వే గట్టి వార్నింగ్

టీ20 ప్రపంచకప్ సూపర్ 8 దశకు ముందు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసాయి. తమ జట్టును తక్కువ అంచనా వేయవద్దని, అండర్‌డాగ్స్‌గా తమ సత్తా నిరూపించుకుంటామని రజా వార్నింగ్ ఇచ్చాడు. వరుస విజయాలతో ఓటమి అనేది లేకుండా సూపర్ 8కు చేరుకున్న జింబాబ్వే పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు కెప్టెన్ స్పష్టం చేశాడు. సూపర్ 8 మ్యాచ్‌ల కోసం భారత్‌కు చేరుకున్న తర్వాత పరిస్థితులను అంచనా వేసి వ్యూహాలు సిద్ధం చేస్తామని రజా తెలిపాడు. ఈ నెల 23న జరగనున్న మ్యాచ్ నిజమైన పోరాటమని, ఫలితాల గురించి ఆందోళన చెందకుండా తమ శక్తి మేరకు పోరాడతామని పేర్కొన్నాడు. మూడు మ్యాచులలో కనీసం రెండింటిని గెలుస్తామని రజా ధీమా వ్యక్తం చేశాడు.

శ్రీలంకతో జరిగిన మ్యాచ్ అనంతరం సికిందర్ రజా మాట్లాడుతూ, సూపర్ 8లో తొలి మ్యాచ్ గెలిస్తే అవకాశాలు ఇంకా మెరుగయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తాము ఎప్పుడూ ముందున్న లక్ష్యంపైనే దృష్టి పెడుతున్నామని, గత రెండు వారాల్లో తమ జట్టు చూపించిన శ్రమ అద్భుతమని కొనియాడాడు. నిజం చెప్పాలంటే తాము సూపర్ 8కు చేరుతామని ఎవరూ ఊహించలేదని రజా వ్యాఖ్యానించాడు. అభిమానుల మనసులు గెలుచుకుని, వారి గౌరవం పొందటం చాలా గొప్ప విషయమని పేర్కొన్నాడు. టాస్ ఓడిన వెంటనే తన జట్టు సభ్యులకు ఒకటే చెప్పానని, “మనం మంచి క్రికెట్ ఆడితే టాస్ ఫలితం మన మైండ్ సెట్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. పరిస్థితి ఏదైనా సరే మనం మంచి క్రికెట్ ఆడితే ఫలితాలు అవే వస్తాయి” అని వివరించాడు. ఓటమి లేకుండా సూపర్ 8కు చేరడం గర్వించదగ్గ విషయమని రజా సంతోషం వ్యక్తం చేశాడు. సూపర్ 8లో మూడు మ్యాచులో రెండు గెలిస్తే ఏమవుతుందో ఎవరికి తెలుసని ప్రశ్నిస్తూ, ప్రతి ఒక్కరికీ అండర్‌డాగ్ కథలంటే ఇష్టం అంటూ రజా సూపర్ 8కు ముందు ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *