Brain Health: చిన్న వయసులో మతి మరుపుకు చెక్.. ఇవి తింటే మీ మెదడు పాదరసంలా పరిగెడుతుంది…

Brain Health: చిన్న వయసులో మతి మరుపుకు చెక్.. ఇవి తింటే మీ మెదడు పాదరసంలా పరిగెడుతుంది…


మెదడు చురుగ్గా ఉండాలంటే కేవలం పజిల్స్ పూర్తి చేయడం లేదా పుస్తకాలు చదవడం మాత్రమే సరిపోదు.. మనం తినే కంచంలో ఏముందనేది కూడా ముఖ్యమే. రిజిస్టర్డ్ డైటీషియన్లు సూచించిన ఈ 10 రకాల ఆహారాలు మెదడును యవ్వనంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్ల మాయాజాలం!

బ్లూబెర్రీస్, రాస్ప్‌బెర్రీస్ మరియు డార్క్ చాక్లెట్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి. ఇవి మెదడులోని విషతుల్యాలను తొలగించి, రక్తం సజావుగా ప్రవహించేలా చేస్తాయి.

ఒమేగా-3.. మెదడుకు ఇంధనం!

మన మెదడులో అధిక భాగం కొవ్వుతోనే ఉంటుంది. అందుకే కొవ్వు చేపలు, వాల్‌నట్స్, చియా విత్తనాలు వంటి ‘మంచి కొవ్వు’ (Omega-3) ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల మెదడు కణాల మధ్య సంబంధాలు దృఢమవుతాయి. ఇది నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.

కూరగాయలు గుడ్లు.. మల్టీవిటమిన్ స్టోర్స్!

బ్రోకలీ, ఆకుకూరలు మరియు గుడ్లలో ఉండే విటమిన్-K, కోలిన్, బి-విటమిన్లు మెదడు వికాసానికి తోడ్పడతాయి. ముఖ్యంగా గుడ్లు తినడం వల్ల అల్జీమర్స్ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మీ డైట్‌లో మార్పులు చేసే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *