Indian Railways: భారతీయ రైల్వే తన ప్రయాణికులకు ఆన్లైన్ టికెట్ బుకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఒక కీలకమైన మార్పును ప్రకటించింది. మార్చి 1, 2026 నుండి జనరల్, ప్లాట్‌ఫారమ్ టికెట్లను బుక్ చేసుకోవడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న UTS మొబైల్ అప్లికేషన్ నిలిచిపోనుంది. అయితే ఇటీవల రైల్వే “RailOne” అనే సరికొత్త అప్లికేషన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులోనే అన్ని సదుపాయాలను అందిస్తోంది.