Team India : సూపర్-8 మ్యాచ్‌లకు ముందే టీమిండియాలో భారీ ప్రక్షాళన..ముగ్గురు స్టార్ ఆటగాళ్లను పక్కనపెట్టిన సూర్య

Team India : సూపర్-8 మ్యాచ్‌లకు ముందే టీమిండియాలో భారీ ప్రక్షాళన..ముగ్గురు స్టార్ ఆటగాళ్లను పక్కనపెట్టిన సూర్య


T20 World Cup 2026 : 2026 టీ20 వరల్డ్ కప్‌లో అసలైన సమరం మొదలైంది. ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్న సూపర్-8 దశ కోసం టీమిండియా సర్వసన్నద్ధమవుతోంది. గ్రూప్ స్టేజ్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టేబుల్ టాపర్‌గా నిలిచినప్పటికీ, భారత జట్టులో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పసికూనలైన అమెరికా, నెదర్లాండ్స్ జట్లు కూడా భారత బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కోవడం మేనేజ్‌మెంట్‌ను ఆలోచనలో పడేసింది. ఈ నేపథ్యంలో సెమీస్ రేసులో నిలవాలంటే కీలకమైన సూపర్-8 మ్యాచ్‌ల కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఫామ్ లేమితో సతమతమవుతున్న ముగ్గురు కీలక ఆటగాళ్లపై వేటు పడే సూచనలు ఉన్నాయి.

1. అభిషేక్ శర్మ

2025 సీజన్‌లో ఏకంగా 859 పరుగులు చేసి టీమిండియాలోకి మెరుపులా దూసుకొచ్చిన అభిషేక్ శర్మ, వరల్డ్ కప్ వేదికపై మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. గ్రూప్ స్టేజ్‌లో ఆడిన మొదటి మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ కనీసం ఖాతా తెరవకుండానే వెనుదిరిగి డకౌట్ల హ్యాట్రిక్ నమోదు చేశాడు. సూపర్-8లో సవాళ్లు ఇంకా కఠినంగా ఉంటాయి కాబట్టి, సూర్యకుమార్ సేన అతడిని పక్కనపెట్టి యశస్వి జైస్వాల్‌ను తిరిగి ఓపెనింగ్‌లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. అభిషేక్ ఫామ్ లేమి భారత జట్టుకు పవర్‌ప్లేలో పెద్ద మైనస్‌గా మారింది.

2. రింకూ సింగ్

భారత నమ్మకమైన ఫినిషర్ రింకూ సింగ్ కూడా ఈ టోర్నీలో ఆశించిన ప్రభావం చూపలేకపోయాడు. అమెరికాపై 14 బంతుల్లో కేవలం 6 పరుగులే చేసిన రింకూ, మిగిలిన మ్యాచ్‌ల్లోనూ వచ్చిన స్వల్ప అవకాశాలను వినియోగించుకోలేకపోయాడు. జట్టు కూర్పు దృష్ట్యా రింకూ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. సుందర్ బ్యాటింగ్‌తో పాటు అదనపు స్పిన్ బౌలింగ్ ఆప్షన్‌ను కూడా ఇస్తాడు. రింకూకు ఎక్కువ బంతులు ఆడే అవకాశం రాకపోవడం ఒక కారణమైతే, ఆరో బౌలర్ లేకపోవడం టీమ్ ఇండియాకు ప్రతికూలంగా మారింది. కాబట్టి ఆల్‌రౌండర్ కోటాలో రింకూపై వేటు పడవచ్చు.

3. అర్ష్‌దీప్ సింగ్

పేసర్ అర్ష్‌దీప్ సింగ్ భవితవ్యం పూర్తిగా పిచ్ పరిస్థితులపై ఆధారపడి ఉంది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ప్రధాన పేసర్లుగా కొనసాగుతుండటంతో, సూపర్-8 మ్యాచ్‌లు జరిగే వేదికలను బట్టి అర్ష్‌దీప్‌ను తప్పించే అవకాశం ఉంది. ముఖ్యంగా చెన్నై వంటి స్పిన్ అనుకూల పిచ్‌లపై భారత్ ముగ్గురు స్పిన్నర్లతో (కులదీప్, సుందర్, అక్షర్) వెళ్లాలనుకుంటే, అర్ష్‌దీప్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. శ్రీలంకలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కూడా పాకిస్థాన్‌పై అర్ష్‌దీప్‌ను పక్కనపెట్టి కులదీప్‌ను ఆడించిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *