ఈ వీకెండ్లో అమెరికా ఇరాన్‌పై దాడులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. యుద్ధనౌకలు సముద్రంలో కదులుతున్నాయి. స్టెల్త్ ఫైటర్ జెట్లు ఆకాశంలో గర్జిస్తున్నాయి. అయితే ట్రంప్ నుంచి ఇంకా ఆమోదం రాలేదని, దాని కోసమే సైన్యం వేచి చూస్తున్నట్లు సమాచారం . పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాయడంతో.. అందరి దృష్టి ఇప్పుడు ఇరాన్ వైపు మళ్లింది. ఇరాన్‌తో అణు ఒప్పందం కుదరని పక్షంలో యుద్ధమే మార్గమని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా తన సైనిక శక్తిని మధ్యప్రాచ్యంలో మునుపెన్నడూ లేనంతగా మోహరించింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అమెరికాకు చెందిన 13 యుద్ధనౌకలు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్’ తో పాటు ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ కూడా ఉన్నాయి. సాధారణంగా ఒకే ప్రాంతంలో రెండు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లను ఉంచడం చాలా అరుదు. కానీ ఇప్పుడవి రెండూ అక్కడ ఉండడంతో.. ఇది ఇరాన్‌పై భారీ స్థాయి దాడులకు అమెరికా సిద్ధమవుతోందనడానికి సంకేతంగా నిలుస్తోందని అంతా భావిస్తున్నారు. వీటికి తోడు ఎఫ్-22 రాప్టర్ స్టెల్త్ ఫైటర్ జెట్లు, ఎఫ్-15, ఎఫ్-16 యుద్ధ విమానాలు ఆకాశంలో నిఘాను ముమ్మరం చేశాయి. ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులను పొట్టన బెట్టుకోవడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అమెరికాపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం చమురు ధరలు తక్కువగా ఉండటం వల్ల యుద్ధం జరిగినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తక్కువగా ఉంటుందని అమెరికా అంచనా వేస్తోంది. చర్చలు ఫలించకపోతే దాడి ఖాయమని హెచ్చరించడానికే రెండో యుద్దనౌకను రంగంలోకి దించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బస్సు కింద మంటలు.. వీడియోల కోసం ఎగబడకుండా ప్రాణాలను కాపాడిన స్థానికులు
మహా కుంభమేళాను తలపించిన త్రిశూల చక్రతీర్థ స్నానం
Rajamouli: జక్కన్న నయా స్ట్రాటజీ.. వర్కవుట్ అవుతోందిగా
వేల్పారిలో ధనుష్.. శంకర్ ప్లాన్ బీ సిద్ధం చేశారా ??
Anupama Parameswaran: సొంత రికార్డును అనుపమ బ్రేక్ చేస్తారా