టెక్సాస్‌లో హనుమంతుడి విగ్రహం.. నోరు పారేసుకున్న రిపబ్లికన్‌ నేత

టెక్సాస్‌లో హనుమంతుడి విగ్రహం.. నోరు పారేసుకున్న రిపబ్లికన్‌ నేత


అమెరికాలోని టెక్సాస్‌ నగరంలో ఉన్న హిందూ దేవుడి విగ్రహంపై రిపబ్లికన్ నేత వివాదాస్పద కామెంట్స్‌ చేశారు. ఈ విగ్రహం ఏర్పాటు భారత వలసదారుల సామ్రాజ్యవాదానికి నిదర్శనమని ఆయన చేసిన పోస్టుపై కలకలం రేగుతోంది. టెక్సాస్‌ షుగర్‌ ల్యాండ్‌లోని అష్టలక్ష్మి ఆలయంలో 90 అడుగుల హనుమాన్‌ కాంస్య విగ్రహం ఉంది. ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనియన్‌’గా పిలిచే ఈ హనుమాన్‌ విగ్రహం అమెరికాలోనే అత్యంత ఎత్తయింది. ఈ విగ్రహానికి సంబంధించిన వీడియోను మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన మద్దతుదారుడు కార్లోస్‌ ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. భారత్ నుంచి వచ్చిన వలసదారులు క్రమంగా టెక్సాస్‌ను ఆక్రమించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ‘అసలు అమెరికాలో హిందూ దేవుడి విగ్రహం ఎందుకు’అని ప్రశ్నించారు. ఈ దండయాత్రను ఆపాల్సిందేనంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కార్లోస్‌ కామెంట్లను ఆలయానికి చెందిన కమ్యూనిటీ సభ్యులు ఖండించారు. అది ప్రైవేటు ప్రాపర్టీ అని..తాము స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి దాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. నెటిజన్లు సైతం కార్లోస్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే విగ్రహంపై గతంలో రిపబ్లికన్‌ పార్టీ నేత అలెగ్జాండర్‌ డంకన్‌ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి హిందూ విగ్రహాన్ని ఇక్కడ మేమెందుకు అనుమతించాలని అప్పట్లో డంకన్ నోరు పారేసుకున్నాడు. అప్పట్లో డంకన్‌ వ్యాఖ్యలను హిందూ అమెరికన్‌ ఫౌండేషన్‌ తీవ్రంగా ఖండించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ వీకెండ్‌లోనే.. ఇరాన్‌పై అమెరికా దాడులు !!

బస్సు కింద మంటలు.. వీడియోల కోసం ఎగబడకుండా ప్రాణాలను కాపాడిన స్థానికులు

మహా కుంభమేళాను తలపించిన త్రిశూల చక్రతీర్థ స్నానం

Rajamouli: జక్కన్న నయా స్ట్రాటజీ.. వర్కవుట్‌ అవుతోందిగా

వేల్పారిలో ధనుష్‌.. శంకర్‌ ప్లాన్‌ బీ సిద్ధం చేశారా ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *