Holi 2026 Date: హోలీ రోజునే సుదీర్ఘ చంద్రగ్రహణం.. మార్చి3న హోలీ పండగ జరుపుకోవచ్చా?

Holi 2026 Date: హోలీ రోజునే సుదీర్ఘ చంద్రగ్రహణం.. మార్చి3న హోలీ పండగ జరుపుకోవచ్చా?


Holi 2026 Date: హోలీ రోజునే సుదీర్ఘ చంద్రగ్రహణం.. మార్చి3న హోలీ పండగ జరుపుకోవచ్చా?

ఏలూరు, ఫిబ్రవరి 20: మార్చి 3న భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించనుంది. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల 46 నిమిషాలకు ముగుస్తుంది. ఈ విధంగా గ్రహణం మొత్తం వ్యవధి సుమారు 3 గంటలు 19 నిమిషాలు ఉంటుంది. బింబ దర్శనకాలం 59 నిముషాలు ఉంటుందని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పంచారామక్షేత్రం శ్రీ ఉమాసోమేశ్వర జనార్ధనస్వామి ఆలయ ప్రధాన అర్చకులు చెరుకూరి రామకృష్ణ శర్మ అంటున్నారు.

మార్చి 3న హోలీ రోజు ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం పడనుంది. ఇది సంవత్సరంలోనే అత్యంత దీర్ఘమైన గ్రహణంగా భావిస్తున్నారు. హిందూ పంచాంగం ప్రకారం మార్చి 3న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు చంద్రగ్రహణం కొనసాగుతుంది. కాబట్టి ఉదయం 11 గంటలలోపు హోలీ జరుపుకోవాలని రామకృష్ణ శర్మ సూచిస్తున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటలకే ఆలయాలను మూసివేయాలని అంటున్నారు. సూతక కాలంలో పూజలు, ఆరాధనలు, విగ్రహాలను తాకడం, కొత్త పనులు ప్రారంభించడం, శుభకార్యాలు చేయడం మంచిది కాదని నమ్మకం. అదేవిధంగా భోజనం చేయకూడదని, ప్రయాణాలు చేయకూడదని, దేవాలయాలకు వెళ్లకూడదని కూడా చెబుతారు. గర్భిణీలు, చిన్నపిల్లలు, రోగులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తారు.

భారతదేశంలో ఈ చంద్రగ్రహణం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా బెంగాల్ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, అలాగే పశ్చిమ బెంగాల్‌లో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో కూడా కొంతవరకు కనిపించవచ్చు. భారతదేశం బయట పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇరాక్, ఇరాన్ వంటి దేశాల్లో కూడా ఈ గ్రహణం కనిపించనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *