Auto News: కార్ల వెనుక 1.2, 2.4 నంబర్లు ఎందుకు ఉంటాయో తెలుసా? చాలా మందికి తెలియని సీక్రెట్‌ ఇదే!

Auto News: కార్ల వెనుక 1.2, 2.4 నంబర్లు ఎందుకు ఉంటాయో తెలుసా? చాలా మందికి తెలియని సీక్రెట్‌ ఇదే!


Auto News: కార్లకు రకరకాల నంబర్లు ఉంటాయి. కానీ వాటి అర్థం కూడా రకరకాలుగా ఉంటాయి. కారు తయారు చేసేటప్పుడు కంపెనీలు వాటి కెపాసిటీ. దాని మోడల్‌ వంటివి నంబర్స్‌ను కారుపై ఇస్తుంటాయి. సాధారణంగా మీరు కారు వెనుకాల కొన్ని నంబర్లు ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయోనని, వాటి అర్థం ఏంటని మీరెప్పుడైనా ఆలోచించారా? కార్ల వెనుక భాగంలో 1.2, 1.5, 2.4 వంటి నంబర్లు తరచుగా కనిపిస్తాయి. చాలామంది వీటిని కారు మోడల్ నంబర్లుగా భావిస్తారు. అయితే ఇవి నిజానికి వాహనం ఇంజిన్ కెపాసిటీని లీటర్లలో సూచిస్తాయి. బైకుల విషయంలో ఇంజిన్ సామర్థ్యాన్ని CC (క్యూబిక్ సెంటీమీటర్లు)లో కొలుస్తారు. అదేవిధంగా కార్ల విషయంలో ఇంజిన్ సామర్థ్యాన్ని లీటర్లలో తెలియజేస్తారు.

ఈ లీటర్ నంబర్‌ను 1000తో గుణించడం ద్వారా ఆ కారు ఇంజిన్ CC సామర్థ్యం తెలుస్తుంది. ఉదాహరణకు కారు వెనుక 1.2 అని ఉంటే అది 1200 CC ఇంజిన్‌ను సూచిస్తుంది. 2.4 అని ఉంటే అది 2400 CC ఇంజిన్‌ను కలిగి ఉందని అర్థం. సాధారణంగా ఈ నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే కారు ఇంజిన్ అంత ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

EPFO Update: మీ సాలరీ అకౌంట్‌ మారిందా? ఈ చిన్న పొరపాటుతో PF డబ్బులు నిలిచిపోవచ్చు!

1000 CC కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఇంజిన్లను లీటర్లలో చెప్పడం సర్వసాధారణం. 2400 CC ఇంజిన్ అని చెప్పడం కంటే 2.4 లీటర్ ఇంజిన్ అని చెప్పడం సులభంగా, ప్రీమియంగా ఉంటుంది. అందుకే పెద్ద ఇంజిన్‌లకు లీటర్ల కొలమానాన్ని ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి:

SIM Fraud: ఇలాంటి సిమ్‌ కార్డు మోసం మీకెప్పుడైనా జరిగిందా? జాగ్రత్త!

Indian Railways: ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న ఈ రైళ్ల ఛార్జీలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *