యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. డార్లింగ్ పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ తనకు ఇష్టమైన వంటకాలు.. భోజనం కోసం తాను చేసిన ఫన్నీ విషయాల గురించి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. సంతోష్ శోభన్, మాసన వారణాసి కలిసి నటించిన చిత్రం కపుల్ ఫ్లెండ్లీ. తాజాగా ఈ మూవీ టీమ్ తో ప్రభాస్ ముచ్చటించారు. ఈ సినిమా చూసి ఆ ఫీల్ నుంచి బయటకు రావడానికి చాలా సేపు పట్టిందని అన్నారు. చివరి 20 నిమిషాలు మరో స్థాయిలో ఉందని ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే ప్రభాస్ మాట్లాడుతూ.. ఫ్యాన్స్ కోసం తాను సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాల్లో నటిస్తున్నానని.. కానీ ఒక్కటే విడుదలవుతుందని అన్నారు. తనకు గీతాంజలి సినిమా అంటే చాలా ఇష్టమని.. తాను డైరెక్టర్ మణిరత్నం అభిమానినని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..
అందరికీ తన ఫుడ్ గురించి తెలుసుకోవాలని ఉంటుందని అన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ.. “మీకు ఒక ఆసక్తికర విషయం చెబుతాను. అప్పుడప్పుడు నేను వేరే రాష్ట్రాల నుంచి ఫుడ్ ఆర్డర్ పెడతాను. ఆదిపురుష్ షూటింగ్ ముంబైలో జరిగేటప్పుడు చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్ట. టీమ్ అందరూ షాకయ్యారు. ఫ్లైట్ లో ఆర్డర్ తీసుకొచ్చిన వ్యక్తి నా దగ్గరకు వచ్చి మీరు మాములు వాళ్లు కాదండీ అని అన్నారు” అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు.
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..
అలాగే తనకు విజయవాడ పునుగులు అంటే చాలా ఇష్టమని అన్నారు. చిన్నప్పటి నుంచి ప్రమోద్ తన బెస్ట్ ఫ్రెండ్ అని.. విజయవాడలో ప్రమోద్ వాళ్ల ఇంటి దగ్గరే ఒక పునుగుల బండి ఉండేదని.. సమ్మర్ లో అతడి ఇంటికి వెళ్లినప్పుడు ప్రమోద్ తండ్రి వెస్పా మీద తామిద్దరని ఎక్కించుకుని పునుగులు తీనిపించేవారని.. ఆ పునుగుల రుచి అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. అలాంటి పునుగులు తన జీవితంలో ఎక్కడ తినలేదని.. వాటిని గుర్తుచేసుకుంటే ఇప్పటికీ నోరూరుతుందని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..