హ్యాట్సాఫ్..! చెత్త కుప్పలో వచ్చిన రూ.15 లక్షల బంగారం.. తిరిగి అప్పగించిన స్క్రాప్ డీలర్!

హ్యాట్సాఫ్..! చెత్త కుప్పలో వచ్చిన రూ.15 లక్షల బంగారం.. తిరిగి అప్పగించిన స్క్రాప్ డీలర్!


నిజాయితీనా.. అది ఎక్కడుంది.. ఎలా ఉంటుంది అనే రోజులు ఇవి..! కలికాలంలో నిజాయితీ ఇంకా బతికే ఉందా అని ప్రశ్నించే రోజులివి.. ఇలాంటి రోజుల్లోనూ నీతి, నిజాయితీ మానుషుల్లో ఇంకా బతికే ఉందని నిరూపించాడు ఓ వ్యాపారి.. దీనికి తాజా ఉదాహరణ ఫరీదాబాద్‌లో కనిపించింది. ఇక్కడ, హాజీ అక్తర్ అలియాస్ ఖాన్ సాహెబ్ అనే స్క్రాప్ డీలర్ గొప్ప మనస్సు చాటుకున్నారు. దాదాపు 100 గ్రాముల అంటే సుమారు 10 తులాల బంగారు ఆభరణాలను స్క్రాప్ అని భావించి పొరపాటున అమ్మేసిన కుటుంబానికి తిరిగి ఇచ్చాడు. ఆ ఆభరణాల విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.

ఈ సంఘటన గత సంవత్సరం జనవరిలో జరిగింది. ఫరీదాబాద్ నివాసి అయిన అశోక్ శర్మ తన కుటుంబంతో కలిసి కుంభమేళాకు వెళ్లాడు. ఇల్లు ఖాళీగా ఉంటే, దొంగతనం జరుగుతుందని భయపడ్డాడు. దీంతో తన ఇంట్లో ఉన్న విలువైన బంగారాన్ని అంతా ఒక పాత పెట్టెలో ప్యాక్ చేసి, చెత్త సంచిలో దాచిపెట్టాడు. సమయం గడిచిపోయింది, కుటుంబసభ్యులు ఆ సంచిలోని పెట్టెను మరచిపోయారు. దీపావళికి ఇల్లు శుభ్రం చేసినప్పుడు, ఆ సంచిని చెత్తగా భావించి అమ్మేశారు. అది ఖాన్ సాహిబ్ చెత్తకుప్పలో పడిపోయింది. అయితే, దీపావళి పూజ కోసం నగలు అవసరమైనప్పుడు, ఆ కుటుంబం తమ తప్పును తెలుసుకుంది. బంగారం పోయిందని గ్రహించి, కుటుంబం మొత్తం భయభ్రాంతులకు గురైంది.

దాదాపు ఆరు నెలలుగా, ఆ కుటుంబానికి ఎటువంటి ఆశ లేదు. కానీ, ఖాన్ సాహిబ్ అనే స్క్రాప్ డీలర్ నిజాయితీని ప్రదర్శించాడు. అతను తన గిడ్డంగిలోని చెత్త కుప్పల మధ్య పాత పెట్టెను కనుగొన్నాడు. పెట్టెను తెరిచి చూడగా, బంగారు ఆభరణాలు చెక్కుచెదరకుండా కనిపించాయి. ఖాన్ సాహిబ్ వెంటనే కుటుంబానికి సమాచారం అందించారు. ACP జితేంద్ర మల్హోత్రా సమక్షంలో, దాదాపు 15 లక్షల రూపాయల విలువైన ఆ నగలను అశోక్ శర్మ, అతని కుటుంబానికి తిరిగి ఇచ్చారు. ఆ నగలు తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

ఈ సంఘటన నేటి సమాజంలో దురాశకు అతీతంగా మానవత్వం, నిజాయితీకి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులు ఉన్నారని రుజువు చేస్తుంది. ఫరీదాబాద్‌కు చెందిన ఈ స్క్రాప్ డీలర్ ఒక కుటుంబానికి ఆనందాన్ని తిరిగి తీసుకురావడమే కాకుండా మొత్తం సమాజానికి ఒక ఆదర్శంగా నిలిచాడు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *