Womens Asia Cup 2026 : వరుసగా రెండోసారి ఫైనల్లో తలపడనున్న భారత్ – పాక్.. కప్పు కొట్టడం ఖాయమేనా ?

Womens Asia Cup 2026 : వరుసగా రెండోసారి ఫైనల్లో తలపడనున్న భారత్ – పాక్.. కప్పు కొట్టడం ఖాయమేనా ?


Womens Asia Cup 2026 : బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత మహిళల ఏ జట్టు అదరగొట్టింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక ఏ జట్టును చిత్తు చేసిన టీమిండియా, వరుసగా రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. కేవలం 13.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి తమ సత్తా చాటింది. ఈ విజయంతో భారత అభిమానుల్లో జోష్ నెలకొంది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. భారత కెప్టెన్ రాధా యాదవ్ స్పిన్ మాయాజాలానికి లంక బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 19.4 ఓవర్లకే 118 పరుగులకు ఆలౌట్ అయింది. రాధా యాదవ్ 19 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి లంక నడ్డి విరిచింది. ప్రేమ రావత్, తనుజా కన్వర్ కూడా రెండేసి వికెట్లతో రాణించారు. లంక జట్టులో సంజన (31) తప్ప ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆరంభం నుంచే ఎదురుదాడి చేసింది. ఓపెనర్ వృందా దినేష్ ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 20 బంతుల్లోనే 8 ఫోర్లతో 42 పరుగులు సాధించింది. అనుష్క శర్మ (27) ఆమెకు మంచి సహకారం అందించింది. చివర్లో కెప్టెన్ రాధా యాదవ్ (31 నాటౌట్) బ్యాట్‌తోనూ మెరిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. దీంతో భారత్ 5 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.

ఇక అందరి దృష్టి ఆదివారం (ఫిబ్రవరి 22) జరగబోయే ఫైనల్ మ్యాచ్‌పైనే ఉంది. రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్ ఏ, బంగ్లాదేశ్ ఏ జట్లు తలపడుతున్నాయి. ఒకవేళ పాకిస్థాన్ గెలిస్తే ఫైనల్లో భారత్-పాక్ హై-వోల్టేజ్ పోరును మనం చూడవచ్చు. ఇప్పటికే గ్రూప్ స్టేజ్‌లో పాక్‌ను ఓడించిన భారత్, అదే ఊపుతో టైటిల్ నెగ్గాలని పట్టుదలతో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *