కావాల్సిన పదార్థాలు : అర కిలో బెండకాయలు, పెద్ద ఉల్లిపాయ, కోడిగుడ్లు 4, 4 పచ్చిమిర్చి, ఒక కప్పు టొమాటో ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా, 3 టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరి పడినంత ఉప్పు తీసుకోవాలి.
ముందుగా బెండకాయలను తీసుకుని శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని కాసేపు పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక బెండకాయ ముక్కలు, ఉల్లిపాయలు, మిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
ఇక ఇప్పుడు అదే పాన్లో రెండు స్పూన్లు నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. దానిలో బెండకాయ ముక్కలు, ఉడికించిన గుడ్లు వేసి నీళ్లు పోసి 10 నిమిషాలు పాటు మూత పెట్టి ఉడికించాలి.
బెండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత కారం, పసుపు, ఉప్పు, మసాలా పొడి వేసి మిక్స్ అయ్యేలా తిప్పుకోవాలి. చివర్లో కొత్తిమీర చల్లుకుని కిందకు దించేయండి. అంతే, వేడి వేడి బెండకాయ కోడిగుడ్డు పులుసు రెడీ.




