దీపావళికి కంపెనీలు ఉద్యోగులకు బోనస్, ఖరీదైన వస్తువుల్ని గిఫ్ట్‌గా అందజేస్తాయి. అయితే, ఓ సంస్థ తన 30 వ వార్షికోత్సవం వేళ ఉద్యోగులకు అదిరే శుభవార్త చెప్పింది. ఇన్నేళ్లూ సంస్థను నమ్ముకుని, కష్టపడి పనిచేసి సంస్థ అభివృద్ధికి కారణమైన వారికి గుర్తింపు ఇచ్చింది. కేరళకు చెందిన హైలైట్ గ్రూప్ లగ్జరీ కార్లను ఇచ్చి ఆశ్చర్యపరిచింది. రిటైల్ స్పేస్ రంగంలో కేరళలో అగ్రగామిగా ఉన్న సంస్థను 1996లో స్థాపించారు. కంపెనీ ప్రారంభం నుంచి పనిచేస్తోన్న 47 మంది ఉద్యోగులకు రూ.20 కోట్ల విలువైన కార్లను అందజేసింది. ఇందులో రేంజ్ రోవర్, లాండ్ రోవర్ డిఫెండర్, ఆడీ క్యూ8, టాటా హ్యారియర్, కియా సెల్టోస్, క్రెటా, స్కోడా మోడళ్లు ఉన్నాయి. దీంతో పాటుగా 2030 నాటికి సంస్థను మరింత విస్తరించి 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని యాజమాన్యం ప్రకటించింది. గతంలో చెన్నైకు చెందిన ఓ కంపెనీ కూడా తమ ఉద్యోగులకు ఖరీదైన కార్లను కానుకగా ఇచ్చింది. దీపావళి సందర్భంగా 28 మందికి లగ్జరీ కార్లు, మరో 29 మందికి బైకులు ఇచ్చింది. వీటిలో హ్యూందాయ్, టాటా, మారుతీ సుజుకీ, మెర్స్‌డేస్ బెంజ్ బ్రాండ్‌లు ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పాము కాటేస్తే మరణ శాసనమే.. భూలోక నరకం
చిన్నారిని క్యాబ్‌లో మరిచిన తల్లితండ్రులు.. చివరికి ??
రాత్రి పూట అన్నం తినడం మంచిదా.. రోటీ మంచిదా ??
పెళ్లికి కుటుంబ సమేతంగా విచ్చేసిన రారాజు.. అతిథులు భయంతో..
రైతును పెళ్ళాడితే రూ.10 లక్షలు.. అంతే కాకుండా