Headlines

రాత్రి పడుకునే ముందు పాదాలు కడగకపోతే ఏమవుతుంది..? మీరు ఊహించని షాకింగ్ నిజాలు..

రాత్రి పడుకునే ముందు పాదాలు కడగకపోతే ఏమవుతుంది..? మీరు ఊహించని షాకింగ్ నిజాలు..


మనం అందంగా కనిపించాలని ముఖానికి క్రీములు రాస్తాం, చేతులను శుభ్రంగా ఉంచుకుంటాం. కానీ రోజంతా మన బరువును మోస్తూ, మనల్ని నడిపించే పాదాలను మాత్రం పట్టించుకోం. చాలామంది రాత్రి పడుకునే ముందు ముఖం కడుక్కుంటారు కానీ పాదాలను మాత్రం అలాగే బెడ్‌పైకి తీసుకెళ్తారు. మీరు కూడా ఇలాగే చేస్తున్నారా? అయితే మీరు మీ మంచాన్ని సూక్ష్మక్రిముల అడ్డాగా మారుస్తున్నట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన పాదంలో 26 ఎముకలు, 33 కీళ్లు , 100 కంటే ఎక్కువ కండరాలు, స్నాయువులు ఉంటాయి. ఇంతటి క్లిష్టమైన వ్యవస్థ కలిగిన పాదాలను నిర్లక్ష్యం చేయడం వల్ల కేవలం చర్మ సమస్యలే కాదు, నడవలేని పరిస్థితి కూడా రావచ్చు.

రాత్రిపూట పాదాలు ఎందుకు కడగాలి?

రోజంతా బూట్లు లేదా చెప్పులు వేసుకోవడం వల్ల పాదాలకు గాలి ఆడక విపరీతంగా చెమట పడుతుంది. దీనివల్ల బయట నుంచి వచ్చే ధూళి, మురికితో పాటు చెమట చేరి బ్యాక్టీరియా, ఫంగస్ పెరగడానికి కారణమవుతాయి. పాదాలు కడగకుండా పడుకుంటే దురద, ఎర్రటి దద్దుర్లు, బొబ్బలు, చర్మం పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. పాదాల ద్వారా వచ్చే సూక్ష్మక్రిములు మీ బెడ్ షీట్లకు అంటుకుని, ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు.. చాలా జాగ్రత్త

షుగర్ పేషెంట్లు పాదాల విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకూడదు. వీరికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల పాదాలకు చిన్న గాయమైనా లేదా ఇన్ఫెక్షన్ వచ్చినా అది త్వరగా నయం కాదు. నిర్లక్ష్యం చేస్తే అది చివరకు శస్త్రచికిత్స వరకు దారితీసే ప్రమాదం ఉంది.

పాదాల కోసం చిన్న చిట్కాలు

రోజుకు రెండుసార్లు: ఉదయం స్నానం చేసేటప్పుడు, రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా పాదాలను సోప్‌తో శుభ్రం చేసుకోవాలి.

గోరువెచ్చని నీరు: వారానికి రెండుసార్లు గోరువెచ్చని నీటిలో పాదాలను నానబెట్టండి. దీనివల్ల కండరాలు రిలాక్స్ అయ్యి నిద్ర బాగా పడుతుంది.

తేమ లేకుండా: పాదాలు కడిగిన తర్వాత వేళ్ల మధ్య తడి లేకుండా తుడుచుకోవాలి. లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *