ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫ్రీ ఎడ్యుకేషన్.. ఏపీ ఆర్టీఈ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లై చేయండి

ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫ్రీ ఎడ్యుకేషన్.. ఏపీ ఆర్టీఈ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లై చేయండి


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద విద్యార్థులకు తీపి కబురు అందించింది. విద్యా హక్కు చట్టం (AP RTE Notification 2026) కింద ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి తరగతిలో ప్రవేశాలకు ఈ అవకాశం కల్పించారు. ఆన్‌లైన్ దరఖాస్తులు ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పథకంతో భారీ ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందే అవకాశం కలగనుంది.

2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు

వచ్చే విద్యా సంవత్సరం (2026–27)లో ఒకటో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యాయి.

25% రిజర్వేషన్ కోటా వివరాలు

మొత్తం ఉచిత సీట్లలో కేటాయింపు ఇలా ఉంటుంది:

ఎస్సీ (SC) – 10%
ఎస్టీ (ST) – 4%
బీసీ, మైనారిటీలు & ఇతరులు – 6%
అనాథలు, హెచ్‌ఐవీ బాధిత పిల్లలు – 5%

దరఖాస్తుదారుల అర్హతలు

గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం రూ. 1.20 లక్షల లోపు ఉండాలి.
పట్టణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం రూ. 1.44 లక్షల లోపు ఉండాలి.

విద్యార్థి వయస్సు కనీసం 5 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.

స్టేట్ సిలబస్‌కు: జూన్ 2, 2020 నుంచి మే 31, 2021 మధ్య జన్మించి ఉండాలి.

సీబీఎస్‌ఈ (CBSE) సిలబస్‌కు: ఏప్రిల్ 1, 2020 నుంచి మార్చి 31, 2021 మధ్య జన్మించి ఉండాలి.

అవసరమైన పత్రాలు

దరఖాస్తు సమయంలో కింది పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి:
పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం
కుల ధృవీకరణ పత్రం
ఆదాయ ధృవీకరణ పత్రం
ఆధార్ కార్డు (తప్పనిసరి)

దరఖాస్తు విధానం

అర్హులైన తల్లిదండ్రులు కింది మార్గాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.. సమీప గ్రామ/వార్డు సచివాలయం, మండల విద్యాశాఖ అధికారి (MEO) కార్యాలయం,
ప్రభుత్వం నిర్దేశించిన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రైవేట్ పాఠశాలల్లో పెరుగుతున్న ఫీజుల భారం నుంచి పేద తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరిన్ని వివరాల కోసం 1800 425 899 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సమాచారం పొందవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *