OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన 20 వేల కోట్ల వసూళ్ల మూవీ.. ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన 20 వేల కోట్ల వసూళ్ల మూవీ.. ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే


ఎప్పటిలాగే ఈ శుక్రవారం (ఫిబ్రవరి 20) కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషలకు చెందిన డబ్బింగ్ సినమాలు ఓటటీలో సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఉంది. గత సంవత్సరం అంటే 2025లో ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. బాక్స్ ఆఫీస్ మోజో ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నే ఈ మూవీ 2 $2.2 బిలియన్లు సంపాదించింది. అంటే భారత కరెన్సీలో సుమారు 19 వేల కోట్ల రూపాయలకు పైగా. ఈ చిత్రం బడ్జెట్ కేవలం 80 మిలియన్ డాలర్లు మాత్రమే. అంటే ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు 700 కోట్ల రూపాయలు. ఇండియాలోన ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. గతేడాది ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ దాదాపు రూ. 2.49 కోట్ల గ్రాస్ (రూ. 2.26 కోట్ల నెట్) వసూళ్లను రాబట్టింది. అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ సినిమా పిల్లలతో పాటు పెద్దలని కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టిన ఈ సినిమా సుమారు 10 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.

యానిమేషన్ సినిమాల చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిన సినిమా ‘నీ జా 2’. ఈ చైనీస్ సినిమా, తన ప్రీక్వెల్ (మొదటి భాగం) రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, ప్రపంచంలోనే అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా నిలిచింది. అంతేకాదు హాలీవుడ్ సినిమాలు కాకుండా 1 బిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన మొట్టమొదటి యానిమేటెడ్ సినిమాగా ‘నీ జా 2’రికార్డు సృష్టించింది.

ఇవి కూడా చదవండి

భారీ యాక్షన్, విజువల్ వండర్‌గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 20) అర్ధరాత్రి నుంచి ఇంగ్లిష్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగు వెర్షన్ మాత్రం ఇప్పుడే రావడం లేదు. ఆ మధ్యన  వచ్చిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహా థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ మూవీ కూడా సేమ్ టు సేమ్ అలాంటి జానరే కావడంతో ఓటీటీలో రికార్డు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా పిల్లలకు ఇలాంటి సినిమాలు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

జియో హాట్ స్టార్ లో చూడొచ్చు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *