సంపద, శాంతి, ఐశ్వర్యాలు.. శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం ఖాయం..!

సంపద, శాంతి, ఐశ్వర్యాలు.. శుక్రవారం ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం ఖాయం..!


హిందూ సంప్రదాయాలలో ప్రతి రోజుకూ ప్రత్యేకత ఉంది. అందులో శుక్రవారం మరింత ప్రాముఖ్యమైన రోజు. ఈ రోజు సంపద, శాంతి, ఐశ్వర్యాలకు ప్రతీక అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అందుకే చాలా మంది ఈ రోజున కొన్ని శుభకార్యాలు, దానాలు చేస్తూ ఆమె అనుగ్రహాన్ని కోరుకుంటారు. మహాలక్ష్మీ అనుగ్రహం అంటే కేవలం భౌతిక సంపద కాదు.. అది మనస్సులో నిగ్రహం, జీవితంలో సమతుల్యత, హృదయంలో కృతజ్ఞత పెంచుతుంది. ఆమె ఆశీర్వాదం పొందినవారికి లోకసంపదలతో పాటు లోకాతీత శాంతి లభిస్తుంది. “ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః” అనే మంత్రధ్వని మనసులోని దారిద్ర్యాన్ని తొలగించి, దివ్యసంపదల వైపు నడిపిస్తుంది. మహాలక్ష్మి అనుగ్రహం కోసం శుక్రవారం ఈ విధంగా చేస్తే ఆమె అనుగ్రహం తప్పక లభిస్తుందని పండితులు చెబుతున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శుక్రవారం దానం చేయాల్సినవి

శుక్రవారం నాడు దానం చేయడం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. ముఖ్యంగా:
తీపి పదార్థాలు దానం చేయడం శుభప్రదం.
తెల్లటి రంగు ఆహారాలు (పంచదార, పెరుగు, పాలు, బియ్యం) దానం చేస్తే గ్రహదోషాలు తగ్గుతాయని విశ్వాసం.
ఉప్పు, పంచదార, పెరుగు వంటి నిత్యావసర వస్తువులు దానం చేస్తే సంపద పెరుగుతుందని చెబుతారు.
ఇవి చేయడం వల్ల వివాహయోగం కలుగుతుంది, దాంపత్య జీవితంలో సఖ్యత పెరుగుతుంది, కుటుంబంలో శ్రేయస్సు నెలకొంటుంది.

శ్రీ యంత్ర పూజ విధానం

శ్రీ యంత్రం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది.

శుక్రవారం నాడు: శ్రీ యంత్రాన్ని ఆవుపాలతో శుభ్రంగా కడగాలి.
పసుపు, కుంకుమతో అలంకరించాలి.
దాన్ని డబ్బు ఉంచే స్థలంలో లేదా పూజా మందిరంలో ప్రతిష్టించాలి.
ఇలా చేయడం వల్ల సానుకూల శక్తి పెరిగి, ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుందని నమ్మకం.

దరిద్ర నివారణకు గుమ్మం వద్ద చేయాల్సినవి

మామిడి ఆకుల తోరణం

శుక్రవారం నాడు మామిడి ఆకులతో తోరణం కట్టితే ఇంటిలో శుభశక్తి ప్రవేశిస్తుందని విశ్వాసం.

ఉప్పు పాత్ర

ఉప్పుతో నిండిన చిన్న పాత్రను గుమ్మం దగ్గర ఉంచితే దృష్టిదోషం, చెడు శక్తులు తొలగిపోతాయని చెబుతారు.

పసుపు నీరు – కర్పూరం

రాగి పాత్రలో నీళ్లు పోసి అందులో పసుపు, కర్పూరం, ఒక నాణెం వేయాలి. దీన్ని గుమ్మం లోపల ఉంచితే ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం.

రావి ఆకుల తోరణం

మామిడి ఆకుల్లానే రావి ఆకులతో తోరణం కట్టినా శుభఫలితాలు కలుగుతాయని భావిస్తారు.

నిమ్మకాయ – మిరపకాయలు

గుమ్మం వద్ద నిమ్మకాయ, మిరపకాయలు కట్టడం వల్ల దృష్టి దోషాలు తొలగి ఆర్థిక సమస్యలు తగ్గుతాయని విశ్వాసం.

కుంకుమతో స్వస్తిక్

శుక్రవారం నాడు గుమ్మం పై కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయడం ఐశ్వర్యానికి సూచకంగా భావిస్తారు.

ఈ విధంగా శుక్రవారం నాడు చిన్నచిన్న ఆచారాలను భక్తిశ్రద్ధలతో పాటిస్తే, లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో ఆనందం, శాంతి, సంపదలు వెల్లివిరుస్తాయని సంప్రదాయ విశ్వాసం.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని సంస్థ ధృవీకరించదు.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *