Cooler Tips: మూలన పడేసిన కూలర్‌ను మళ్లీ తీస్తున్నారా? స్వచ్ఛమైన గాలి రావాలంటే ఈ సీక్రెట్ ట్రిక్ ఫాలో అవ్వండి!

Cooler Tips: మూలన పడేసిన కూలర్‌ను మళ్లీ తీస్తున్నారా? స్వచ్ఛమైన గాలి రావాలంటే ఈ సీక్రెట్ ట్రిక్ ఫాలో అవ్వండి!


వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రస్తుతం అందరూ కూలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ, కూలర్ల వాడకంలో అజాగ్రత్త వహిస్తే అది శ్వాసకోస సమస్యలకు, చర్మ వ్యాధులకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండాకాలం సమీపిస్తుండటంతో చాలా మంది పాత కూలర్లను బయటకు తీస్తుంటారు. వాటిని చెక్ చేయకుండా అలాగే వాడేస్తుంటారు. అందుకే నిపుణులు కూలర్ల వినియోగంపై పలు కీలక సూచనలు చేస్తున్నారు.

పాత కూలర్లతో ప్రమాదం పొంచి ఉంది!

గత ఏడాది వాడి మూలన పడేసిన కూలర్లను మళ్లీ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిలో పేరుకుపోయిన దుమ్ము, పాత నీటి వల్ల ఫంగస్, బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. వీటిని శుభ్రం చేయకుండా ఆన్ చేస్తే, ఆ గాలి ద్వారా క్రిములు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి శ్వాసకోస ఇబ్బందులు కలిగిస్తాయి.

గడ్డి మార్చడం మర్చిపోవద్దు!

కూలర్లకు మూడు వైపులా ఉండే గడ్డి (Cooling Pads)ని తప్పనిసరిగా మార్చాలి. పాత గడ్డిలో ధూళి కణాలు పేరుకుపోయి గాలి ప్రసరణను అడ్డుకోవడమే కాకుండా, దుర్వాసనను కూడా కలిగిస్తాయి. కొత్త గడ్డిని వేయడం వల్ల చల్లదనంతో పాటు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది.

నీటి నిల్వపై ప్రత్యేక శ్రద్ధ!

చాలామంది కూలర్లో నీరు అయిపోతే పాత నీటిపైనే కొత్త నీరు పోస్తుంటారు. ఇలా చేయడం వల్ల నీరు రంగు మారి దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది. దీనివల్ల డెంగీ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి, ప్రతిరోజూ పాత నీటిని తొలగించి, ట్యాంక్‌ను శుభ్రం చేసిన తర్వాతే కొత్త నీటిని నింపాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఆరుబయట ఉంచితేనే మేలు!

కూలర్‌ను గది లోపల కంటే కిటికీ వద్ద లేదా ఆరుబయట అమర్చడం వల్ల బయట ఉండే స్వచ్ఛమైన గాలిని అది లోపలికి పంపిస్తుంది. దీనివల్ల గదిలో ఉక్కపోత తగ్గి, హ్యుమిడిటీ (తేమ) సమస్య లేకుండా చల్లగా ఉంటుంది.

వేసవిలో చల్లదనం ముఖ్యం, కానీ ఆరోగ్యం అంతకంటే ముఖ్యం. కూలర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ, వైద్యుల సూచనలు పాటిస్తే ఈ వేసవిని హాయిగా గడిపేయవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *