Uday Kiran: ఆ ఒక్క సినిమా రిలీజై ఉంటే ఉదయ్ కిరణ్ బతికి ఉండే వాడు.. షాకింగ్ విషయం చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్

Uday Kiran: ఆ ఒక్క సినిమా రిలీజై ఉంటే ఉదయ్ కిరణ్ బతికి ఉండే వాడు.. షాకింగ్ విషయం చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్


ఉదయ్‌ కిరణ్‌.. ఎంత వేగంగా పైకి ఎదిగాడో అంతే వేగంగా కిందకు పడిపోయాడు. వరుసగా ప్రేమ కథా చిత్రాలు చేస్తూ టాలీవుడ్ లో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఒకానొకదశలో సక్సెస్ కోసం చాలా రోజులు ముఖం వాచిపోయేలా ఎదురు చూశాడు. తనకున్న లవర్ బాయ్ ఇమేజ్ ను పక్కన పెట్టి యాక్షన్ సినిమాలను ట్రై చేశాడు. కానీ విజయం మాత్రం అతనికి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. సినిమానే ప్రాణంగా భావించిన ఈ నటుడు అందులో సక్సెస్ అందకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ లోకంలో ఉండలేనంటూ అర్ధాంతరంగా తనువు చాలించాడు. 2014 జనవరి 5న ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది. ఉదయ్ కిరణ్ చనిపోయి సుమారు పుష్కర కాలం దాటినా ఇప్పటికీ అతని సినిమాల రూపంలో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఇదిలా ఉంటే మనసంతా నువ్వే రిలీజ్ నేపథ్యంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జోస్యభట్ల ఉదయ్ కిరణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఉదయ్‌ కిరణ్‌ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కెరీర్ లో చాలా ఆటు పోట్లు చూశాడు. అతను నటించాల్సిన చాలా సినిమాలు ఆగిపోయాయట. షూటింగ్ ప్రారంభమై నిలిచిపోయిన చిత్రాలు కూడా ఉన్నాయట. ఒక సినిమా అయితే ఏకంగా ఎనభై శాతం షూటింగ్‌ పూర్తయిన తర్వాత పక్కన పెట్టారంటున్నాడు జోస్య భట్ల. ‘ఉదయ్‌ కిరణ్‌ నటించిన `ప్రేమంటే సులువు కాదురా` సినిమా 80శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆఖరి దశలో ఆగిపోయింది. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయి విడుదలైతే ఉదయ్‌ కి పెద్ద హిట్‌ పడేది. కానీ ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. అందుకు కారణాలు కూడా తెలియరాలేదు. నిర్మాతలు కూడా ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్రయత్నించినా కుదరలేకపోయింది. ఏం జరిగిందో ఏమో గానీ, `ప్రేమంటే సులువు కాదురా` మూవీ విడుదలయ్యి ఉంటే మాత్రం ఇప్పుడు ఉదయ్‌ కిరణ్‌ మన మధ్య ఉండేవాడు. అతను సూపర్ స్టార్ గా ఎదిగి ఉండే వాడు. అతని సినిమాలను మనం ఎంజాయ్‌ చేసేవాళ్లం’ అని జోస్యభట్ల చెప్పుకొచ్చారు. ఉదయ్ కిరణ్ గురించి ఈ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *