ప్రస్తుతం డైరెక్టర్ మారుతీ చూపు.. ఆ ఇద్దరి యంగ్ హీరోల వైపే

ప్రస్తుతం డైరెక్టర్ మారుతీ చూపు.. ఆ ఇద్దరి యంగ్ హీరోల వైపే


ఆఫ్టర్ రాజాసాబ్ డైరెక్టర్ మారుతీ దారెటు అని అందరూ ఆరా తీస్తున్నారు. ఏ హీరో కాంపౌండ్‌లోకి వెళతారోనని ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన మాత్రం.. చడీ చప్పుడు కాకుండా కేరళ వెళ్లి తన నెక్ట్స్‌ సినిమా స్క్రిప్ట్‌ను రాసే పనిలో బిజీగా ఉన్నారట. దాంతో పాటే.. తన స్క్రిప్ట్‌కు న్యాయం చేసే హీరోలు.. ఆ ఇద్దరేనని.. ఆల్రెడీ ఫిక్సయ్యారట. ఎట్ ప్రజెంట్ తన దృష్టంతా ఆ ఇద్దరు హీరోల మీదే పెట్టి.. తన నెక్ట్స్‌ సినిమాను పట్టాలెక్కించటమే ప్రైమరీ పనిగా పెట్టుకున్నారట. అయితే ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు.. రాపో రామ్ పోతినేని & మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌. డైరెక్టర్ మారుతీ మైత్రీ మూవీస్ బ్యానర్‌లో ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పుడీ బ్యానర్లోనే తన నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్న మారుతీ.. అందుకోసం హీరోలుగా రామ్ పోతినేని లేదా వరుణ్‌ తేజ్ ఫిక్స్ చేయనున్నాడట. ఇద్దరికీ తన కథ చెప్పి.. ఎవరు ఓకే అంటే వారితో చకా చకా సినిమాను తీయాలని అనుకుంటున్నారట. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. రాజాసాబ్ నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా.. ప్రభాస్ నుంచి మాత్రం ఈ డైరెక్టర్‌కు మంచి మద్దతే ఉంది. సో ఇద్దరిలో ఎవరో ఒకరిని ఒప్పించేందుకు ప్రభాస్‌ కూడా ఓ చేయి వేసే ఛాన్స్ ఉందని.. ఇన్‌సైడ్ టాక్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్‌

Naga Chaitanya: నాగ చైతన్యతో.. గంగూలీ, జాన్‌ అబ్రహాం ఢీ అంటే ఢీ.. ఇంతకీ గెలిచేది ఎవరో

Varanasi: వారణాసిలో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ రివీల్.. మంచి ఛాన్స్ కొట్టేశాడుగా

ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *