Indian Railways: కొత్త రూల్‌.. రైళ్లలో ఎమర్జెన్సీ కోటా కింద సీట్లు ఎవరికి కేటాయిస్తారు?

Indian Railways: కొత్త రూల్‌.. రైళ్లలో ఎమర్జెన్సీ కోటా కింద సీట్లు ఎవరికి కేటాయిస్తారు?


భారతీయ రైల్వేలు ప్రయాణికుల అత్యవసర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బుకింగ్ వ్యవస్థగా అత్యవసర కోటా (Emergency Quota – EQ)ను అమలు చేస్తున్నాయి. ఇది సాధారణ ప్రయాణికుల కోసం కాదు. అత్యవసర పరిస్థితుల్లో కొంతమంది నిర్దిష్ట వర్గాల వారికి మాత్రమే పరిమితంగా అందుబాటులో ఉంటుంది.

అత్యవసర కోటా అంటే ఏమిటి?

అత్యవసర కోటా అనేది కొన్ని రైళ్లలో, కొన్ని తరగతుల్లో ముందుగా రిజర్వ్‌ చేసిన సీట్లు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న అత్యంత ప్రాధాన్యత గల అభ్యర్థుల అత్యవసర ప్రయాణ అవసరాలను తీర్చేందుకు ఈ కోటాను ఉపయోగిస్తారు.

ఎవరికి ఎలాట్‌ ఇస్తారు?

  • కేంద్ర మంత్రులు
  • సుప్రీం కోర్టు, హై కోర్టు న్యాయమూర్తులు
  • పార్లమెంటు సభ్యులు
  • హై అఫీషియల్ రిక్విజిషన్ (HOR) హోల్డర్లు

వీరికి కాకుండా మిగిలిన సీట్లను ఇతర అత్యవసర అభ్యర్థనలకు విడుదల చేయవచ్చు.

  • ప్రభుత్వ విధి కోసం ప్రయాణం
  • కుటుంబంలో మరణం లేదా తీవ్ర అనారోగ్యం
  • అత్యవసర ఉద్యోగ ఇంటర్వ్యూ

ఎలా ఆమోదిస్తారు?

  • ముందుగా HOR హోల్డర్లు, మంత్రులు, న్యాయమూర్తుల స్వీయ ప్రయాణాలకు కేటాయింపు
  • తర్వాత MPలు, ఇతర అధికారిక అభ్యర్థనలు
  • చివరగా అత్యవసర వ్యక్తిగత కేసులు

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *