Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారు వెంటనే ఈ పని చేయండి.. లేదంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం..

Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారు వెంటనే ఈ పని చేయండి.. లేదంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం..


నేటి కాలంలో ఆధార్ కార్డు లేనిదే ఏ పనీ జరగదు. పిల్లల స్కూల్ అడ్మిషన్ల నుండి ప్రభుత్వ పథకాల వరకు బ్యాంక్ అకౌంట్ల నుండి పాన్ కార్డు వరకు ప్రతిదానికీ ఆధార్ అనుసంధానం తప్పనిసరి. అయితే ఆధార్ ఎంత అవసరమో.. దానితో అంతే ప్రమాదం కూడా పొంచి ఉంది. మీ ఆధార్ వివరాలు గనుక సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే, మీ అనుమతి లేకుండానే మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బు మాయమయ్యే అవకాశం ఉంది. ఈ ముప్పు నుండి తప్పించుకోవడానికి ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఫీచర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

ఆధార్‌తో బ్యాంక్ ఖాతాకు పొంచి ఉన్న ముప్పు ఏంటి?

మనం ఆధార్ కార్డును దాదాపు అన్ని ఆర్థిక లావాదేవీలకు లింక్ చేస్తున్నాం. మన ఆధార్ డేటాలో పేరు, చిరునామాతో పాటు అత్యంత కీలకమైన వేలిముద్రలు, ఐరిస్ వివరాలు ఉంటాయి. సైబర్ దొంగలు ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ ద్వారా మన వేలిముద్రలను ఫోర్జరీ చేసి, బ్యాంక్ ఖాతాల నుండి డబ్బును దొంగిలిస్తున్నారు. మీరు మీ ఆధార్ డేటాను లాక్ చేయకపోతే, మీ బయోమెట్రిక్స్ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.

రక్షణ కవచంలా ఆధార్ లాక్

మీ అనుమతి లేకుండా ఎవరూ మీ వేలిముద్రలను ఉపయోగించకుండా ఉండాలంటే.. UIDAI వెబ్‌సైట్‌లో మీ బయోమెట్రిక్ వివరాలను లాక్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ ఆధార్ సురక్షితంగా ఉంటుంది.

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ [https://myaadhaar.uidai.gov.in](https://myaadhaar.uidai.gov.in) కి వెళ్లండి.
  • మీ 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, మీ మొబైల్‌కు వచ్చే OTP ద్వారా లాగిన్ అవ్వండి.
  • హోమ్ పేజీలో మీకు Lock/Unlock Biometrics అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • అక్కడ ఉన్న సూచనలను చదివి.. Next బటన్ నొక్కండి. మీ బయోమెట్రిక్స్‌ను లాక్ చేయాలనుకుంటున్నారా? అనే బాక్స్‌ను టిక్ చేసి కన్ఫర్మ్ చేయండి.

ఒక్కసారి లాక్ చేస్తే, మీ వేలిముద్రలు ఎక్కడా పని చేయవు. ఒకవేళ మీరు ఎక్కడైనా వేలిముద్ర వేయాల్సి వస్తే, మళ్ళీ ఇదే పద్ధతిలో క్షణాల్లో అన్‌లాక్ చేసుకోవచ్చు.

ప్రయోజనాలు

  • మీ అనుమతి లేకుండా ఎవరూ బయోమెట్రిక్ లావాదేవీలు చేయలేరు.
  • ఆధార్ ఆధారిత బ్యాంకింగ్ మోసాలకు చెక్ పెట్టవచ్చు.
  • మీ వ్యక్తిగత వివరాలు మరింత సురక్షితంగా ఉంటాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *