అదే విధంగా తప్పకుండా ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో మంచి హెల్దీ ఆహారం తీసుకోవాలి. కొంత మంది ఎగ్జామ్ హడావిడిలో పడి టిఫిన్ చేయడం మానేస్తారు కానీ, ఇది పరీక్షపై ప్రభావం చూపుతుంది. ఆకలితో చదివింది మర్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఆయిల్ ఫుడ్ కాకుండా, శక్తినిచ్చే ఆహారం తీసుకొని ఎగ్జామ్ రాయడానికి వెళ్లాలి. ముఖ్యంగా కోడి గుడ్డు, తాజా ఆకుకూరలు, వీలైతే ఒక పండు తిని వెళ్లడం మంచిది.