Headlines

Blinkit: నిందితులు చెప్పిన నిజాలు.. బ్లింకిట్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు!

Blinkit: నిందితులు చెప్పిన నిజాలు.. బ్లింకిట్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు!


ఢిల్లీలోని ఖ్యాలా ప్రాంతంలో ఇటీవల జరిగిన రెండు హత్యలు కేసులో అరెస్టైన నిందితులు చెప్పిన వివరాలు పోలీసులకు షాక్ గురిచేశాయి. ఈ రెండు కేసుల్లో నిందితులను అరెస్టు చేసి విచారించగా కత్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితులు హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తులను బ్లింకిట్ నుంచి కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. దీంతో ఢిల్లీలోని బ్లింకిట్‌ గోడౌన్‌లపై పోలీసులు దాడులు చేశారు.

ఈ సోదాల్లో బ్లింకిట్ గోడౌన్‌ల నుంచి సుమారు 55 బటన్ కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బ్లింకిట్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అలాగే బ్లింకిట్ సంస్థకు నోటీసులు పంపనున్నట్టు పోలీసులు తెలిపారు. బటన్ కత్తులను విక్రయించడం నేరమని.. నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా ఇలా విక్రయిస్తే కఠిన చర్యల తప్పవంటూ హెచ్చరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *