Indian Railways: సాధారణంగా ఏదైనా టూర్లకు పెళ్లిళ్లకు బంధువులతో సహా ఫ్యామిలీ మొత్తం వెళ్లాలంటే ఏదైనా వెహికిల్స్‌ను బుక్ చేసుకుంటాము. కార్లు, బస్సులు ఇలా రకరకాలు బుక్ చేసుకుని వెళ్తుంటాము. మరి ఇలాంటి కార్యక్రమాలకు రైళ్లను కూడా బుక్ చేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా? బస్సులు, ఇతర వాహనాలు అయితే బుక్ చేసుకోవచ్చు.. మరి ట్రైన్‌ను బుక్ చేసుకోవడం ఎలా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. పెళ్లిళ్లు, టూర్లు, లేదా ఇతర ప్రత్యేక కార్యక్రమాల కోసం మీరు రైలు మొత్తం లేదా ప్రత్యేక కోచ్‌లను బుక్ చేసుకోవచ్చు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఫుల్ టారిఫ్ రేక్స్ (FTR) పోర్టల్ ద్వారా ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ప్రయాణికుల సౌలభ్యం కోసం IRCTC ftr.irctc.co.in వెబ్‌సైట్‌లో స్పెషల్ కోచ్‌లు లేదా స్పెషల్ ట్రైన్‌లను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.
కోచ్ బుక్ చేసుకునేందుకు ఎంత డిపాజిట్ చేయాలి?
ఇక ఇలా పెళ్లిళ్లు, టూర్లకు ఫ్యామిలీ మొత్తం వెళ్లేందుకు ఒక కోచ్‌ను బుక్ చేసుకోవడానికి రూ.50,000 వరకు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు 18 కోచ్‌లతో కూడిన పూర్తి రైలును బుక్ చేసుకోవాలనుకుంటే ఏకంగా రూ.9 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ అవసరం. ఈ డిపాజిట్ అడ్వాన్స్ మాత్రమే. ఫైనల్ బిల్లులో అడ్జస్ట్ చేస్తారు. ధర విషయానికి వస్తే, సాధారణ రైలు టిక్కెట్ల కంటే 30% ఎక్కువ ఉంటుంది. అదనంగా సర్వీస్ ఛార్జీలు కూడా వర్తిస్తాయి. అది కూడా మీరు వెళ్లే దూరాన్ని బట్టి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Auto News: 7 సీట్ల కారు కేవలం రూ.5.65 లక్షలకే.. బేస్ మోడల్‌లోనే అద్భుతమైన ఫీచర్స్!
ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకోవాలి?
ఇక బుకింగ్ విషయానికొస్తే.. ఎప్పుడు పడితే అప్పుడు బుక్ చేసుకునేందుకు కుదరదు. సాధారణం మనం ఐఆర్‌సీటీసీ నుంచి టికెట్స్ బుక్ చేసుకుంటే 60 రోజుల ముందు బుక్ చేసుకుంటాము. అలాగే ఈ విషయంలో కూడా బుకింగ్ వ్యవధి ఉంటుంది. బుకింగ్ కోసం కనీసం 30 రోజుల ముందు నుండి గరిష్టంగా 6 నెలల ముందు వరకు దరఖాస్తు చేసుకోవాలి. వందే భారత్, రాజధాని వంటి ప్రీమియం రైళ్లను ప్రత్యేక బుకింగ్‌ల కోసం అనుమతించరు. మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే ఇలా బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ సేవ వ్యక్తిగత లేదా గ్రూప్ ప్రయాణాలకు సౌకర్యవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఇలా బుక్ చేసుకోవాలంటే రైల్వే నియమ నిబంధనలు ఉంటాయి. వాటికి అనుగుణంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: బ్యాంకు అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం ఖచ్చితంగా తెలియాల్సిందే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి