Uday Kiran : అప్పట్లో ఉదయ్ కిరణ్ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటే.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..

Uday Kiran : అప్పట్లో ఉదయ్ కిరణ్ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటే.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..


టాలీవుడ్ దర్శకుడు తేజ ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. కానీ కొన్నాళ్లుగా ఆయన రూపొందించిన సినిమాలు అంతగా ఆకట్టుకోవడం లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, ముఖ్యంగా ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిన చిత్రం, నువ్వు నేను చిత్రాల నిర్మాణం గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 2000 సంవత్సరంలో విడుదలైన చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన తేజ, ఈ సినిమా కథను క్షణక్షణం కోసం పనిచేసే సమయంలోనే ఒక పక్కన పెట్టుకుని రాశానని తెలిపారు. ఆ తర్వాత పదేళ్లకు గానీ ఆ కథ సినిమా రూపం దాల్చలేదని చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..

చిత్రం హీరో ఎంపిక ఒక అనూహ్య మలుపు. మొదట అనుకున్న హీరో చేయనని చెప్పడంతో, స్నేహితుల్లో ఉన్న ఉదయ్ కిరణ్ ను హీరోగా తీసుకున్నారు. షూటింగ్‌కు ఒక రోజు ముందు, ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి ఉదయ్ కిరణ్ హీరోగా, రీమా సేన్ హీరోయిన్‌గా ఖరారు చేసి, మరుసటి రోజు ఉదయమే షూటింగ్ ప్రారంభించారు. ఉదయ్ కిరణ్ మొదటి రోజుల్లో నటన విషయంలో కొంత తడబడటంతో, తేజ స్వయంగా అతనికి శిక్షణ ఇచ్చి నటనను రాబట్టారు. కేవలం 30-31 రోజుల్లోనే చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసినట్లు తేజ వెల్లడించారు. ఈ వేగం ఆనాటి సినీ చరిత్రలో గొప్ప విషయంగా నిలిచింది. అప్పట్లో అల్లూరి సీతారామరాజు సినిమాను 19 రోజుల్లో తీసిన ఘనతను, కృష్ణ గారు ఒకే సంవత్సరంలో ఆరు నుంచి పది సినిమాలు విడుదల చేసిన సందర్భాలను తెలుపుతూ, సమయపాలనతో సినిమా నిర్మాణం ఎంత వేగంగా సాగించవచ్చో వివరించారు.

తేజ తన కెరీర్‌ను చెన్నైలో కెమెరా అసిస్టెంట్‌గా ప్రారంభించి, తర్వాత రామ్ గోపాల్ వర్మ దగ్గర శివ, క్షణక్షణం వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కథ, స్క్రీన్ ప్లే రచయితగా పనిచేశారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ప్రోత్సాహంతో కెమెరామెన్‌గా మారి, తెలుగులో రాత్రి, అంతం, మనీ, రక్షణ, తీర్పు వంటి ఐదు చిత్రాలకు పనిచేశారు. తీర్పు తర్వాత బాలీవుడ్‌కు వెళ్ళి, అక్కడ కెమెరామెన్‌గా పనిచేస్తూనే హిందీ సినిమాలకు కథలు రాశారు. దర్శకుడిగా మారి రెండు సినిమాలు చేసిన తర్వాత, నిధుల సమస్యతో సొంతంగా చిత్రం మూవీస్ బ్యానర్‌ను స్థాపించి, నిర్మాతగా కూడా మారారు. చిత్రం సినిమాకు తాను, ఉదయ్ కిరణ్, ఆర్.పి. పట్నాయక్ సహా చిత్ర బృందంలోని అందరికీ రూ. 11,000 మాత్రమే పారితోషికంగా తీసుకున్నట్లు గుర్తుచేసుకున్నారు.

చిత్రం తర్వాత ఫ్యామిలీ సర్కస్, నువ్వు నేను చిత్రాలను ఏకకాలంలో ప్రారంభించారు. నువ్వు నేను కథను మొదట మాధవన్ తో చేయాలని భావించినప్పటికీ, అతను తెలుగు సినిమాలు చేయనని చెప్పడంతో, మళ్ళీ ఉదయ్ కిరణ్ కే ఆ అవకాశం దక్కింది. చిత్రం విజయం తర్వాత కూడా ఉదయ్ కిరణ్ కు పెద్దగా అవకాశాలు రాలేదని, అందరూ అతన్ని ఒక యావరేజ్ నటుడిగా భావించారని తేజ తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *