Australia: ఆ ప్లేయర్ బలుపే కారణమా.. ఆ చెత్త ఘటనతో ఆస్ట్రేలియా పతనం షురూ..!

Australia: ఆ ప్లేయర్ బలుపే కారణమా.. ఆ చెత్త ఘటనతో ఆస్ట్రేలియా పతనం షురూ..!


Downfall of Australian Cricket: ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియా, ఈసారి టీ20 వరల్డ్ కప్‌లో నిరాశపరిచింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించడం ఇది కేవలం రెండోసారి. మిచెల్ మార్ష్ కెప్టెన్సీలో శ్రీలంక, జింబాబ్వే వంటి జట్ల చేతిలో ఓడిపోవడం జట్టు పతనానికి సంకేతంగా అభిమానులు భావిస్తున్నారు. ఇదే సమయంలో కెప్టెన్ మిచెల్ మార్ష్‌కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను జట్టు డౌన్‌ఫాల్‌కు కారణంగా కొందరు అనుసంధానం చేస్తున్నారు.

ఒక అవమానకర ఘటనతోనే ఆస్ట్రేలియా పతనానికి ఆరంభమా..?

2023 ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. అయితే ఫైనల్ తర్వాత విజయోత్సవాల సమయంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ వరల్డ్ కప్ ట్రోఫీపై కాలు పెట్టి కూర్చున్న ఫొటో వైరల్ అయింది. ఈ ఫోటోను చాలా మంది అభిమానులు అవమానకరంగా భావించారు. ముఖ్యంగా భారత అభిమానులు దీన్ని “అహంకారం” అంటూ కామెంట్స్ చేశాడు.

ఈ ఘటన తర్వాత నుంచే ఆస్ట్రేలియా జట్టు ప్రదర్శన క్రమంగా పడిపోతూ వస్తోందని అభిమానులు భావిస్తున్నారు. ఒకటి తర్వాత ఒకటి కీలక పరాజయాలు ఎదురవుతూ జట్టు ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టు కనిపిస్తోంది.

Downfall Of Australian Cricket

గత 2 ఏళ్లలో ఆస్ట్రేలియా దారుణ ప్రదర్శన ఎలా ఉందో ఓసారి చూద్దాం..

2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా జట్టు ప్రదర్శనలో స్పష్టమైన పతనం కనిపించింది.

2024 టీ20 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌కు చేరలేకపోయింది. సూపర్-8లోనే నిష్క్రమించింది.

టీ20 వరల్డ్ కప్‌లో అఫ్గానిస్తాన్ చేతిలో తొలిసారి ఓడింది.

వెస్టిండీస్‌తో హోం గ్రౌండ్‌లో 27 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఓడిపోయింది.

2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భారత్ చేతిలో పరాజయం.

2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఓడి టైటిల్ కోల్పోయింది.

పాకిస్తాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లతో వరుసగా మూడు వన్డే సిరీస్‌లు ఓడిపోయింది.

భారత్‌తో హోం, అవే రెండింట్లో టీ20ఐ సిరీస్‌లు కోల్పోయింది.

పాకిస్తాన్‌తో టీ20ఐ సిరీస్‌లో వైట్‌వాష్ ఎదురైంది.

టీ20 వరల్డ్ కప్ 2026లో జింబాబ్వేతో పరాజయం.

13 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నమెంట్‌లో శ్రీలంక చేతిలో ఓటమి.

ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమణ.. 2009 తర్వాత 50 లేదా 20 ఓవర్ల వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజ్‌లోనే బయటపడటం ఇదే మొదటిసారి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *