Headlines

Andhra: అందరూ పే..ద్ద పామును భలేగా పట్టాడనుకున్నారు.. కట్ చేస్తే.. కాసేపటి తర్వాత

Andhra: అందరూ పే..ద్ద పామును భలేగా పట్టాడనుకున్నారు.. కట్ చేస్తే.. కాసేపటి తర్వాత


Andhra: అందరూ పే..ద్ద పామును భలేగా పట్టాడనుకున్నారు.. కట్ చేస్తే.. కాసేపటి తర్వాత

మహానంది నల్లమల అడవిలో ఏ ఇంట్లో గానీ, పొలాల్లో గానీ, షాపుల్లో గానీ, నాగుపాము గానీ, కొండచిలువ గానీ, కనపడితే స్నేక్ క్యాచర్ మోహన్‌ను సంప్రదిస్తారు. అలాంటి మోహన్ పాము కాటుకు గురికావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం అయిన మహానంది ఆలయంలో ‌నాగుపాము హల్చల్‌ చేసింది. నాగుపామును పట్టుకోవడానికి ప్రయత్నించిన స్నేక్ క్యాచర్ మోహన్‌ను నాగుపాము కాటేసింది. నాగుపాము కాటుతో అప్రమత్తమైన మోహన్ వెంటనే ఆలయ పరిసరాలలో ప్రథమ చికిత్స అందిస్తున్న డాక్టర్ల వద్ద చికిత్స పొందారు.

అనంతరం మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో నంద్యాల సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం స్నేక్ క్యాచర్ మోహన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మహానంది అటవీ ప్రాంతం సమీపంలో ఎన్నో పాములు, కొండచిలువలు ఎంతో చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ మోహన్ నాగుపాము కాటు గురికావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *