Headlines

T20 World Cup 2026: ఛోకర్స్ టీంకు ముందుంది ముసళ్ళ పండుగ.. ఆ బ్యాడ్ లక్ గీత దాటేనా?

T20 World Cup 2026: ఛోకర్స్ టీంకు ముందుంది ముసళ్ళ పండుగ.. ఆ బ్యాడ్ లక్ గీత దాటేనా?


Proteas Super Eight challenge 2026: టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే, ఐడెన్ మార్క్రం నేతృత్వంలోని సౌతాఫ్రికా జట్టు నాలుగు గ్రూపుల్లో అత్యంత కఠినమైన గ్రూప్‌లో ఉందనే అభిప్రాయం వినిపించింది. న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడాలతో కూడిన గ్రూప్ డీ నుంచి సూపర్-8 దశకు చేరడం సులువు కాదని అంతా భావించారు. నిజంగానే సౌతాఫ్రికాకు అంత సులువు కాలేదు. కెనడా, న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయాలు సాధించినప్పటికీ, అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ మాత్రం తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగింది. గత సీజన్ రన్నరప్‌గా నిలిచిన ప్రోటియాస్ రెండు సూపర్ ఓవర్ల వరకు వెళ్లి, తృటిలో గెలిచింది.

అహ్మదాబాద్‌లో జరిగిన ఆ టెన్షన్ మ్యాచ్ నుంచి బయటపడ్డాక, బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో యూఏఈతో జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికా పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చని అంచనా. ఈ మ్యాచ్ గెలిస్తే, సూపర్-8 దశకు పర్ఫెక్ట్ రికార్డ్‌తో అడుగుపెడుతుంది.

అయితే, ఐసీసీ టోర్నీల్లో గత అనుభవాల కారణంగా, ఈ టోర్నీ రెండో భాగంలో ప్రోటియాస్ ఎలా ఆడతారోనే వారి విజయానికి కొలమానం అవుతుంది. గతేడాది టాంబా బవుమా నేతృత్వంలోని సౌతాఫ్రికా జట్టు లార్డ్స్‌లో ఆస్ట్రేలియాపై వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలిచి ఆ ఒత్తిడిని కొంత మేర తగ్గించింది. ఈసారి మార్క్రం సేన కూడా ఆ ఒత్తిడిని తట్టుకుని నిలబడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

సౌతాఫ్రికా స్పెషలిస్ట్ కన్సల్టెంట్‌గా ఉన్న ఆల్బీ మోర్కెల్ మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. “వరల్డ్ కప్ అసలు ఇప్పుడే ప్రారంభమైంది. గ్రూప్ దశ కఠినంగానే ఉన్నా, ఇప్పుడు భారత్ కావొచ్చు జింబాబ్వే, అలాగే వెస్టిండీస్ వంటి బలమైన జట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్లేఆఫ్స్‌కు దగ్గరయ్యే కొద్దీ మ్యాచ్‌లపై ఒత్తిడి మరింత పెరుగుతుంది,” అని ఆల్బీ మోర్కెల్ అన్నారు.

“కానీ మా జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు చాలామందే ఉన్నారు. బౌలర్లు, బ్యాటర్లు ఐపీఎల్ వంటి లీగ్‌లలోనూ, ఇతర టోర్నీల్లోనూ ఒత్తిడిని ఎదుర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్ కాస్త భిన్నంగా ఉన్నా, ఈ ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం మా ఆటగాళ్లకు ఉంది. ఒత్తిడి పెరిగే మ్యాచ్‌ల్లోనే మా జట్టు మరింత మెరుగ్గా ఆడుతుందని నమ్ముతున్నాం. మేం పెద్దగా ఆందోళన చెందడం లేదు” అంటూ చెప్పుకొచ్చాడు. మరి చోకర్స్ ముద్రపడిన సౌతాఫ్రికా జట్టు తదుపరి దశలో ఎలా రాణిస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *