ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో పక్షి జాతులు ఉన్నాయి. ఒక్క పక్షిమాత్రం అత్యంత విషపూరితం. అదే హుడెడ్ పిటోహుయ్. న్యూ గినియా అడవుల్లో కనిపిస్తుంది. చూడ్డానికి అచ్చం కాకిలాగే కనిపించే ఈ పక్షికి ఒంటి నిండా విషమే. ఈ ప్రత్యేక లక్షణంతోనే ఈ పక్షి ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పక్షిగా గుర్తింపు పొందింది. ఈ పక్షికి ఉన్న మరో ప్రత్యేక ఏంటంటే.. ఇది ఇతర పక్షులపై దాడి చేయడదు, వేటాడదు. కానీ దీని జోలికి మాత్రం ఒక్క జీవి కూడా రాదు. ఎందుకంటే.. దీపి శరీరాన్ని తాకితే ఇతర పక్షులకు ప్రమాదం. ఈ పక్షికి శరీరమే రక్షణ కవచం. దీని ఓంట్లో ఇంతలా విషం తయారవ్వడానికి ప్రధాని కారణం ఇది తినే ఆహారం. అవును ఇది తనే ఆహారం కారణంగానే దీని శరీరంలో విషం ఉత్పత్తి అవుతుందట. అయితే విషం దాని బాడీలో కాకుండా చర్మం, రెక్కలపై మాత్రమే ఉంటుందట. పొరపాటున వేరే జీవులు దీనికి తగిలితే అవి మరణించక తప్పదు. అదే విషం డార్ట్ కప్పలలో కూడా కనిపిస్తుంది. ఒక వేళ ఈ పక్షి మనుషులకు కానీ తగిలితే ఆ వ్యక్తికి పక్షవాతం వస్తుంది. కొన్ని సార్లు అది తీవ్ర అనారోగ్యానికి దారి తీయవచ్చు. ఈ పక్షి ఉండే ప్రాంతాల్లోని ప్రజలకు దీని గురించి బాగా తెలుసు. కాబట్టి ఎవరూ దాని జోలికి వెళ్లరు. మొత్తానికి ప్రకృతిలో అరుదైన, అందమైన పక్షులు కూడా ఇంత ప్రమాదకరంగా ఉంటాయని ఎవరూ ఊహించి ఉండరు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్రంలో సరదా విహారం.. ప్రాణాల మీదికొచ్చింది..
Prabhas: దెబ్బ మీద దెబ్బకు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రభాస్
కోటిన్నరకు భర్తను అమ్మేసిన భార్య.. కారణం ఇదే !! మహానుభావురాలు
‘నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు’ స్టార్ హీరోయిన్ ఆవేదన
Rajinikanth: మిత్రుడైనా.. రెమ్యునరేషన్లో నో కాంప్రమైజ్ గురూ..!