ఓ మహిళను దారుణంగా హత్య చేసి ఆధారాలు దొరకకుండా.. పెట్రోల్‌తో తగలబెట్టిన కేసులో నిందితుడికి జీవిత ఖైదీ విదుస్తూ ఆదోని కోర్ట్ రెండవ అదనపు జిల్లా న్యాయధికారి పీజే సుధా తీర్పును వెలువరించారు ఏఎస్ఐ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం.. గోనెగండ్ల మండలం బి. అగ్రహారం గ్రామానికి చెందిన హంద్రీ దేవదాసుకు, అదే మండలం బైలుప్పల గ్రామానికి చెందిన లక్ష్మి మధ్య వివాహేతర సంబంధం ఉండేది.. ఈ క్రమంలోనే.. ఆమెను వదిలించుకోవాలని పథకం వేసి.. చర్చికి వెళ్దామని ఆమెను అడవిలోకి తీసుకెళ్లి మర్డర్ చేశాడు.
2021 జూన్ 6న బంధువుల పెళ్ళికి వెళ్ళిన లక్ష్మి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి కిష్టమ్మ జూన్ 13న గోనెగండ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తొలుత దీనిని ‘వుమెన్ మిస్సింగ్’ కేసుగా నమోదు చేశారు. అయితే, ఆతర్వాత ఆమె హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది..
అడవిలో హత్య.. పెట్రోల్‌తో దహనం:
మహిళ అదృశ్యం కేసు అనంతరం.. అప్పటి ఎమ్మిగనూరు రూరల్ సిఐ మంజునాథ్ ఈ కేసును దర్యాప్తు చేపట్టారు. నిందితుడు దేవదాసును విచారించగా అసలు విషయం బయటపడింది. చర్చికి వెళ్దామని నమ్మించి లక్ష్మిని తన మోటార్ సైకిల్‌పై ఎక్కించుకున్నాడు. కసాపురం సమీపంలోని అడవి ప్రాంతంలో ఆమెతో గొడవపడి హత్య చేశాడు. అనంతరం ఆనవాళ్లు దొరకకుండా పెట్రోల్‌తో మృతదేహాన్ని తగులబెట్టి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లాడు.
నిందితుడు దేవదాసు ఇదే తరహాలో తెలంగాణలోని షాద్‌నగర్ మరియు కర్నూలు త్రీ టౌన్ పరిధిలో కూడా హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ రెండు కేసులు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్నాయి. ప్రాసిక్యూషన్ తరపున పీపీ మోతిలాల్ బలమైన వాదనలు వినిపించగా, నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..