ప్రస్తుతం యూట్యూబ్ లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా గత పది రోజులుగా ఒక పాట దుమ్మురేపుతుంది. అదే “రాతిరి రాతిరి రాతిరిలో”. ఈ పాట యూట్యూబ్‌లో కేవలం పది రోజుల్లోనే 13 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుని సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ సాంగ్ సింగర్స్ నరసింహులు, ఉష ఈ పాట విజయం, దాని వెనుక ఉన్న కథను వివరించారు. నరసింహులు, ఉషలు పాడిన “చీమ దసరా”, “గట్టుకు గన్నెరాకు”, “నువ్వు ఏడున్నావే గంగి” పాటలు విజయం సాధించాయి. అయితే “రాతిరి రాతిరి” పాట ఇంత పెద్ద విజయం సాధిస్తుందని తాము ఊహించలేదని గాయకులు తెలిపారు. ఈ పాటకు రెండుసార్లు వాయిస్ రికార్డు చేయాల్సి వచ్చిందని ఉష పేర్కొన్నారు. పాట వీడియో షూటింగ్ నాణ్యతే విజయానికి ప్రధాన కారణమని అన్నారు. సంతోష్, ప్రశాంత్ అనే యువకులు ఈ పాటకు సాహిత్యం, సంగీతం అందించడమే కాకుండా, నిర్మాతలుగా వ్యవహరించి, అత్యుత్తమ చిత్రీకరణతో పాటను అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారని వాఅన్నారు. మూడు రోజుల పాటు రాత్రి వేళల్లో జరిగిన ఈ షూటింగ్‌కు భారీగా ఖర్చు చేశారని, దాని ఫలితమే పాట ప్రజాదరణ అని వారు వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..
ఉష తన అమ్మమ్మ పాటలు పాడేదని, ఆమె పోలికే తనకు వచ్చిందని తెలిపింది. చిన్నతనంలో స్కూల్‌కు ఎగ్గొట్టి మరీ పాటలు పాడేదాన్నని, పీర్ల పండగలు, హోలీ, బొడ్డెమ్మ పండుగలలో గానం చేసేదానినని గుర్తుచేసుకుంది. నరసింహులు కూడా చిన్నప్పటి నుంచే పాటలపై ఆసక్తి పెంచుకున్నానని, స్కూలులో పాడేవాడినని, పదేళ్ల క్రితం చిన్న చిన్న ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొని మెరుగుపడ్డానని తెలిపారు. ఈటీవీలో ప్రసారమైన “ఫోక్ స్టూడియో” వంటి కార్యక్రమాల ద్వారా తమ ప్రయాణం ప్రారంభమైందని వారు చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Actress Pratyusha : హీరోయిన్ ప్రత్యూష మృతి కేసు.. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం..
కొందరు నిర్మాతలు జానపద పాటలపై పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారని, మరికొందరు లాభాలు పొందుతున్నారని వారు తెలిపారు. పాటల చిత్రీకరణ సరిగ్గా లేకపోతే, ఎంత మంచి పాట అయినా ప్రజల్లోకి వెళ్లదని, అందువల్ల వీడియో నాణ్యత చాలా కీలకమని తెలిపారు. తాము పాడిన తర్వాత వీడియో ఎలా ఉంటే బాగుంటుందో నిర్మాతలకు సూచనలు కూడా ఇస్తామని వారు తెలిపారు. అలాగే కొందరు వ్యక్తులు తమ వద్ద దాదాపు 30 పాటలు తీసుకుని తమను మోసం చేశారని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Actress Pratyusha : హీరోయిన్ ప్రత్యూష మృతి కేసు.. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం..
ఎక్కువ మంది చదివినవి : Actress Prathyusha : స్టార్ హీరోలతో సినిమాలు.. కెరీర్ పీక్స్‌లో సూసైడ్.. హీరోయిన్ ప్రత్యూష ఎలా చనిపోయిం