ప్రయాణికులకు రైల్వే శాఖ సూపర్ న్యూస్ అందించింది. రైల్వేశాఖ కొత్త రకం రైళ్లను తీసుకొస్తుంది. ఇప్పటికే సాధారణ వందే భారత్, వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లను కొత్తగా ప్రవేశపెట్టిన విషయం తెలిసింది. ఇటీవల బడ్జెట్లో బుల్లెట్ రైళ్ల కారిడార్లను ప్రకటించగా.. రానున్న రెండు, మూడు ఏళ్లల్లో హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.