Andhra: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై హత్య.! కట్ చేస్తే.. తెల్లారి చెరువులో డెడ్‌బాడీగా..

Andhra: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై హత్య.! కట్ చేస్తే.. తెల్లారి చెరువులో డెడ్‌బాడీగా..


మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు మృతి.. చెరువులో దొరికిన మృతదేహం..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అన్నమయ్య జిల్లా మదనపల్లె బాలిక హత్యాచారం కేసు నిందితుడు కులవర్ధన్ మృతి చెందాడు. కరంబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో అతని మృతదేహం కనిపించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని మదనపల్లెకు తరలిస్తున్నారు. నిన్న హత్యాచారం అనంతరం నిందితుడు పరారైనట్టు పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. అటు నీరుగట్టువారిపల్లిలోని కులవర్ధన్ ఇంటి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే.. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నిన్న అదృశ్యమైన ఏడేళ్ల బాలిక శవంగా కనిపించిన సంగతి తెలిసిందే. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా..
— ఇంటికి సమీపంలోనే బాలిక ఓ డ్రమ్ములో శవమై కనిపించింది..
— కులవర్ధన్‌ అనే వ్యక్తిని అనుమానిస్తున్నారు పోలీసులు
— ఈ కులవర్ధన్‌ బాలిక ఇంటి సమీపంలోనే నివాసం ఉంటున్నాడు
— అనుమానితుడు కులవర్ధన్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *